ఇది నాయకుడికి మహా అవమానమే!

Update: 2019-02-24 05:50 GMT
ఊహించని విధంగా ఎన్టీఆర్ కథానాయకుడు డిజాస్టర్ గా నిలిస్తే భయపడిన విధంగా మహానాయకుడు సైతం చేతులెత్తేసాడు. రెండు రోజుల వసూళ్లు ఏ మాత్రం ఆశాజనకంగా లేవు. పికప్ అవుతుందన్న నమ్మకమూ లేదు. ఈ రోజు ఆదివారం కాబట్టి ఓ మోస్తరుగా మెయిన్ సెంటర్స్ లో ఎంతో కొంత రాబట్టుకున్నా కింది స్థాయి కేంద్రాల్లో మాత్రం ఆల్రెడీ డెఫిసిట్లు వస్తున్నాయని ట్రేడ్ రిపోర్ట్.

ఇదలా ఉంచితే రాష్ట్రమంతటా ప్రధాన కేంద్రాలలో ఏ స్టార్ హీరో అయినా తెల్లవారుఝామున బెనిఫిట్ షోలు వేయడం సర్వసాధారణం. అందులోనూ బాలయ్య లాంటి హీరో అయితే 4 నుంచి 5 మధ్యలో బొమ్మ పడాల్సిందే. కథానాయకుడు ముహూర్తం ఫిక్స్ చేసి మరీ ఉదయం 4 గంటల 50 నిమిషాలకు స్క్రీన్లు స్టార్ట్ చేసారు. కాని మహానాయకుడికి అలాంటిది ఏది జరగలేదు. తాపీగా ఉదయం 11 గంటల నుంచి ప్రదర్శనలు మొదలలయ్యాయి.

నిజానికి ఎన్టీఆర్ విడుదల ముందు వరకు బాలయ్య సామాజిక వర్గమైన కమ్మ నుంచి మద్దతు ఉంటుంది కాబట్టి వసూళ్ళ కు ధోకా లేదనే అనుకున్నారు అందరూ. అయితే అభిమానులతో సహా కమ్మ వర్గం దీని మీద ఏమంత ఆసక్తి చూపలేదు. కర్నూల్-అనంతపూర్- చిత్తూర్ లాంటి జిల్లా కేంద్రాల్లో సైతం రెగ్యులర్ షోలు వేసారు కాని ప్రీమియర్లు కాదు. కమ్మకు కంచుకోటగా చెప్పుకునే మండపేటలోనూ ఇదే పరిస్థితి. ఇక కడప నుంచి శ్రీకాళహస్తి దాకా అన్ని చోట్లా ఒకటే తీరు.

అసలు ఎవరూ డిమాండ్ చేయకపోవడం వల్లే బెనిఫిట్ షోలు రద్దు చేసారని టికెట్లు అమ్మకానికి పెట్టినా సగం కూడా అమ్ముడుపోయే పరిస్థితి లేనందువల్లే డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు కలిసికట్టుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెబుతున్నారు. వంద సినిమాల వైభవం ఉన్న బాలయ్య లాంటి హీరో సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందేమిటా అని సాధారణ ప్రేక్షకులు సైతం ఆశ్చర్యపోయరంటే అతిశయోక్తి కాదు
   

Tags:    

Similar News