• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నాకు ఏ హీరో ఇల్లు...

నాకు ఏ హీరో ఇల్లు కొనివ్వలేదు : రష్మి గౌతం

By - Tupaki Desk
Update: 2022-11-22 04:28 GMT
హీరోయిన్స్ ఎవరైనా సొంత ఇల్లు కొంటే అది ఆమె సొంతంగా కొనుక్కునదేనా లేక ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారా అన్న కామెంట్స్ సర్వ సాధారణం అయ్యాయి. బుల్లితెర భామలు కూడా ఈమధ్య కొత్త కార్లు, విల్లాలు కొనేస్తున్నారు. వీరికి ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి.. ఎవరైనా గిఫ్ట్ గా ఇస్తున్నారా అనే కామెంట్స్ కూడా చేస్తున్నారు.

అయితే ఎవరు స్పందించినా స్పందించకపోయినా జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతం మాత్రం ఈ కామెంట్స్ పై తన మార్క్ పంచ్ విసిరింది. తన పేరు మీద ఉన్న కారు, బంగారం, ఇల్లు ఇవన్నీ తన సొంత డబ్బుతో కొన్నవే ఎవరు గిఫ్ట్ గా ఇచ్చినవి కాదని అంటుంది రష్మి.

సెలబ్రిటీస్ ఏదైనా కొత్త వస్తువు కొన్నా.. కొత్త ఇల్లు కొనుక్కున్నా ఎవరో గిఫ్ట్ గా ఇచ్చారంటూ కామెంట్స్ చేయడం కామన్ అయ్యింది. అయితే అలా కామెంట్స్ చేసిన వారికి తన సమాధానాలతో షాక్ ఇస్తుంది రష్మి.

ఇది నా కష్టార్జితం అంటుంది రష్మి. ఎవరో గిఫ్ట్ ఇస్తే తీసుకోవాల్సిన అవసరం తనకు లేదని అంటుంది. జబర్దస్త్ యాంకర్ గా సూపర్ ఫాం లో ఉన్న రష్మి ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. అంతేకాదు పెట్ లవర్ అయిన రష్మి ఎవరైనా వాటిని హింసించినట్టు తెలిస్తే మాత్రం వారి ఫోటోలతో సహా ఇన్ స్టాగ్రాం లో పెట్టి తన వాదన వినిపిస్తుంది.    

మూగ జీవాల మీద మనుషులు చేస్తున్న దారుణాల మీద రష్మి తన గొంతు వినిపిస్తుంది. ఆమెని ఫాలో అయ్యే కొందరు కూడా రష్మి లానే మూగ జీవాలకు తమ వంతు సహాయాన్ని అందిస్తున్నారు. ఇలా ప్రతి విషయంలో తన వాయిస్ బలంగా వినిపించే రష్మి తను సొంతంగా కొనుక్కున్న ఇల్లు, కారు మీద ఎవరో గిఫ్ట్ గా ఇచ్చారని చెబితే ఊరుకుంటుందా.. అందుకే వారికి ఆన్సర్ గా ఇదంతా నేను సొంతంగా సంపాదించుకున్న ఆస్తి అంటూ చెప్పుకొచ్చింది రష్మి.

జబర్దస్త్ షో తోనే పాపులర్ అయిన రష్మి మధ్యలో కొన్ని సినిమాలు చేసింది. వెండితెర మీద బోల్డ్ అటెంప్ట్ చేస్తూ వచ్చిన రష్మి రీసెంట్ గా బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాలో నటించింది. సినిమాలో రష్మి నటనకు మంచి మార్కులే పడ్డాయి. జబర్దస్త్ లో పర్మినెంట్ యాంకర్ అయిన రష్మి ఈమధ్య శ్రీదేవి డ్రామా కంపెనీకి కూడా యాంకరింగ్ చేస్తూ సత్తా చాటుతుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • RashmiGautham 
  • Heroine 
  • Anchor 
  • Villa 
  • Jabardast 
  • Celebraties 
  • SocailMedia 
  • BommaBlockBusterCinema 
  • SriDeviDramaCompany 
  • MovieNews 

Similar News

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

రాధికా ఆప్టే.. అప్పుడో మాట.. ఇప్పుడో మాట

2026-11-03 18:01 GMT

పిల్లి కళ్ల భామకు వరుస అవకాశాలు..!

2026-11-03 17:54 GMT

ఈ ఒక్క వారం ఏకంగా 24 చిత్రాలు ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఎప్పుడు?ఎక్కడంటే?

2026-11-03 17:53 GMT

RC 17: నాన్నకు ప్రేమతో కాదు.. ఈసారి అమ్మకు ప్రేమతో..!

2026-11-03 17:51 GMT

దేవుడి కీర్తనను రాజకీయం చేస్తారా ?

2026-11-03 17:50 GMT

విజయ్ దేవరకొండ కష్టం మొత్తం ఎక్కడికి పోతుంది?

2026-11-03 17:30 GMT

ఐష్..పీసీ త‌ర్వాత ఆవిడ‌దే మూడ‌వ స్థానం!

2026-11-03 16:30 GMT

ప్రభాస్ ఆ రెండు రోజులు రాజమౌళి కి కాల్ చేస్తూనే ఉన్నాడా...

2026-11-03 15:30 GMT

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

Copyright @2026

Powered by Blink CMS