• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాలయ్య తో నో చాన్స్..?

బాలయ్య తో నో చాన్స్..?

By - Tupaki Desk
Update: 2021-12-12 04:30 GMT
బాలయ్య. అఖండతో అద్భుతమైన హిట్ కొట్టారు. బాలయ్యా మజాకా అనిపించేశారు. సరైన కంటెంట్ ఉంటే బాలయ్య మూవీ రిజల్ట్ ఎలా ఉంటుందో చెప్పడానికి అఖండ కళ్లెదుట ఉదాహరణ. ఈ మూవీకి ముందు బాలయ్య రూలర్ అన్న మూవీ చేశారు. కేఎస్ రవికుమార్ తో చేసిన ఆ మూవీకి కేవలం ఏడు కోట్ల రూపాయలే కలెకషన్స్ వచ్చాయి. బాలయ్య కేరీర్ లో డిజాస్టర్ గా మిగిలిపోయింది.

దాంతో బాలయ్య మార్కెట్ మీద అందరికీ సందేహాలు వచ్చేశాయి. కొత్త తరంతో అంతా కొట్టుకుపోయిందని కూడా కామెంట్స్ కూడా చేసిన వారున్నారు. అయితే బాలయ్య మార్కెట్ ఎక్కడికీ పోలేదు, పైగా కాస్తా తక్కువ డిమాండ్ ఉన్న నైజాం, ఓవర్సీస్ లో కూడా జెండా ఎగరేసి మరీ అఖండమైన విజయాన్ని బాలయ్య సాధించారు.

దీంతో టాప్ డైరెక్టర్స్ అంతా బాలయ్య వైపు చూస్తున్నారు. టాలీవుడ్ లో కలెక్షన్ల సునామీ సృష్టించే అతి కొద్ది హీరోలలో బాలయ్య కూడా ఒకరని భావిస్తున్నారు. దాంతో ఆయన కాల్షీట్లకు డిమాండ్ ఒక్కసారిగా పెరుగుతోంది. సరైన సబ్జెక్ట్ ఉంటే బాలయ్యతో పాన్ ఇండియా లెవెల్ మూవీని తీయాలని కూడా భావించే మేకర్స్ కూడా ఉన్నారు.

ఈ నేపధ్యంలో బాలయ్య చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఇంకా పూరీ జగన్నాధ్ తో కూడా సినిమా కమిట్ అయ్యే చాన్స్ ఉంది. అయితే బాలయ్యతో మళ్లీ సినిమా తీసి లైమ్ లైట్ లోకి రావాలని కొందరు డైరెక్టర్స్ చూస్తున్నారు. అలాంటి వారిలో ఒకప్పుడు బాలయ్యకు నాలుగు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన బి గోపాల్ ఒకరు.

బి గోపాల్ ఈ మధ్య దాకా బాలయ్యతో సినిమా ఉంటుందని భావిస్తూ వచ్చారు. అయితే ఇపుడు అఖండ విజయంతో బాలయ్య స్టామినా ఏంటో తెలిసిపోయింది. ఆయన డైరెక్టర్ల లిస్ట్ కూడా మారిపోయింది. మరి బి గోపాల్ తో బాలయ్య మూవీ ఈ టైమ్ లో ఉంటుందా అంటే నో చాన్స్ అనే జవాబు వస్తోందిట.

ఇక మరో డైరెక్టర్ శ్రీవాసు. ఆయన డిక్టేటర్ అన్న మూవీని బాలయ్యతో తీశారు. ఆ మూవీ ఏవరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే మంచి కధతో వెళ్ళి బాలయ్యబాబుని కలసి మూవీ చేయడానికి శ్రీవాస్ ప్రిపేర్ అవుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇపుడు బాలయ్య లైనప్ వేరేగా ఉంది. ఇదే ఊపులో ఆయన్న మరిన్ని సినిమాలు చేసేలా ఉన్నారు. కానీ ప్రయోగాలు చేయడానికి ఆయన ఆలోచిస్తారనే అంటున్నారు. సో బాలయ్యతో కమిట్ అయిన డైరెక్టర్స్ అంతా సినిమాలు సెట్స్ మీదకు తీసుకురాలంటేనే మరో రెండు మూడేళ్ళ టైమ్ పడుతుంది. దాంతో బాలయ్య శ్రీ వాసు లాంటి వారికి చాన్స్ ఇస్తారా అన్నది ఇప్పట్లో చెప్పడం కష్ట‌మే అంటున్నారు.
Tags:    
  • sri vasu 
  • b gopal 
  • Akhanda 
  • Nandamuri Balakrishna 
  • Akhanda movie reviews 
  • Akhanda songs 
  • Akhandamoviecolleaction 

Similar News

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

Copyright @2026

Powered by Blink CMS