చరణ్‌-ఎన్టీఆర్.. డ్రీమ్ లో కూడా కష్టమే

Update: 2017-02-23 12:30 GMT
ఓ రెండు రోజుల నుండి ఒకటే రూమర్లు. రామ్ చరణ్‌ కొత్తగా స్థాపించిన కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఒక సినిమా చేస్తున్నాడంటూ నానా హంగామా వినిపిస్తోంది. ఇంతలోనే సదరు హీరోలకు సంబంధించిన పీఆర్వోలు స్పందిస్తూ.. అబ్బే అలాంటిదేం లేదే అంటున్నారు. అసలు నిజంగా చరణ్‌ అండ్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఒక సినిమా చేద్దామని అనుకున్నా కూడా.. అది మెటీరియలైజ్ అయ్యే పరిస్థితి ఇక్కడుందంటారా?

వాస్తవానికి మంచి కథ.. ఒక సంచలన దర్శకుడు.. ఇవి రెండూ సెట్టయితే ఈ కాంబినేషన్లో సినిమా రావడం పెద్ద విషయం కాదులే. కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఈ ఇద్దరూ కూడా రెండు డిఫరెంట్ అండ్ స్ర్టాంగ్ ఫ్యాన్ గ్రూపులకు లీడర్లు. ఆల్రెడీ శాతకర్ణి సినిమా ఓపెనింగ్ కు చిరంజీవి వెళ్ళినప్పటికీ.. బాలయ్య #చిరు60 ఈవెంట్ కు వచ్చినప్పటికీ.. అవన్నీ డిఫరెంట్. కాని ఇప్పుడు చరణ్‌ ఎన్టీఆర్ తో ఒక సినిమా తీస్తే మాత్రం.. చాలా అనవసరమైన ఇష్యూలు తలెత్తే ఛాన్సుంది. సినిమా స్పీడ్ గా ఫినిష్‌ చేస్తే చుట్టేశారనే కామెంట్లు ప్రొడ్యూసర్ వినాలి. ఒకవేళ రిజల్ట్ తేడా వస్తే.. నిర్మాత మాటను హీరో వినలేదనే రూమర్లు వినాలి. హిట్టయితే క్రెడిట్ ఇటు హీరోకా లేక నిర్మాతకా? ఇది ఇంకో ప్రశ్న. ఇవన్నీ అవసరమా చెప్పండి?

అందుకే ఇప్పుడు అసలు అలాంటి ఆలోచనే పెట్టుకోకపోవడం బెటర్ అంటున్నారు సినిమా పండితులు. డ్రీమ్ లో కూడా ఈ కాంబినేషన్లో ఏదన్నా సినిమా ఊహించడం కాస్త కష్టమే. ఏదో ఒకరి సినిమాల ఓపెనింగులకు వస్తే ఓకె గాని.. అనవసరంగా ఫ్యాన్స్ మనోభావాలు దెబ్బతినేలా కాంబినేషన్లు మనకెందుకు బాస్!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News