ఫోటో స్టొరీ: నిత్యా ఈజ్ బ్యాక్ టు గ్లామర్!

Update: 2019-07-06 06:01 GMT
సౌత్ లో ఉండే టాలెంటెడ్ బ్యూటీస్ లో నిత్యా మీనన్ ఒకరు. ఈ మధ్య తెలుగులో నిత్యా మీనన్ జోరు తగ్గింది కానీ ఏదో ఒక సినిమాలో అయితే కనిపిస్తూ ఉంది. 'అ!'.. 'గీత గోవిందం'.. 'ఎన్టీఆర్ కథానాయకుడు' చిత్రాల్లో నిత్యా నటించిన సంగతి తెలిసిందే.  ఇక 'ప్రాణ' అనే డబ్బింగ్ సినిమా రిలీజ్ అయినా అదేమీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభావం చూపించలేదు.  అయితే ఈమధ్య నిత్య వెయిట్ కొంచెం తగ్గి స్లిమ్ గా మారింది.  దీంతో రెట్టించిన ఉత్సాహంతో ఫోటో షూట్లు చేస్తోంది.

తాజాగా నిత్య తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది.  ఈ ఫోటోకు "అన్నిటికంటే ఎగ్జైటింగ్.. ఛాలెంజింగ్.. చెప్పుకోదగ్గ రిలేషన్ ఏదైనా ఉంది అంటే అది నీతో నీకున్న సంబంధమే" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.   'సెల్ఫ్ లవ్' ఫోటో సీరీస్ లో భాగంగా పోస్ట్ చేస్తున్న ఫోటో అని వెల్లడించింది. అంటే ఈ ఫోటోల సీరీస్ మరికొన్ని రోజులు కంటిన్యూ అవుతుందన్నమాట. ఈ ఫోటో షూట్ చేసిన ఫోటోగ్రాఫర్ బీజ్ లఖాని.  

ఫోటోలో వైట్ కలర్ స్లీవ్ లెస్ నెట్టెడ్ టాప్.. గ్రే కలర్ థై స్లిట్ స్కర్ట్ ధరించి ఒక చెక్క బల్లపై స్టైల్ గా కూర్చుంది.  తన డ్రెస్ పై బటన్స్ పెట్టుకోకుండా వేసుకున్న లైట్ పింక్ కలర్ స్వెటర్ ను కూడా  స్టైలిష్ గా ఉంది. అందాల విందులు గట్రా లేవు కానీ కర్లీ హెయిర్.. సెన్సువల్ ఎక్స్ ప్రెషన్ తో కొంచెం హాట్ గా కనిపిస్తోంది. మరో ఫోటోలో ఫుల్లు గా నవ్వుతూ పోజిచ్చింది. ఈ ఫోటోలకు "న్యాచురల్ బ్యూటీ".. "బ్యూటిఫుల్ బేబీ".. "నీ కర్లీ హెయిర్ సూపర్.. క్యూట్ గా ఉన్నావు" అంటూ కామెంట్లు పెట్టారు.  ఇక నిత్యా సినిమాల విషయానికి వస్తే తెలుగులో నితిన్ నిర్మిస్తున్న ఒక సినిమాలో నటిస్తోంది. హిందీలో అక్షయ్ కుమార్ 'మిషన్ మంగల్' లో నటిస్తోంది.  తమిళంలో జయలలిత బయోపిక్ 'ది ఐరన్ లేడీ'.. మరో చిత్రం 'సైకో' లోనూ నటిస్తోంది.  మలయాళంలో మరో రెండు చిత్రాలలో కూడా నటిస్తోంది. 
Tags:    

Similar News