కాంగ్ తో పోటీ ప‌డ‌నున్న నితిన్..!

Update: 2021-02-11 16:33 GMT
యూత్ స్టార్ నితిన్ - కీర్తి సురేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ''రంగ్ దే''. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైమెంట్స్ బ్యాన‌ర్‌ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి లెజెండరీ పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించగా.. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఈ రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని మార్చి 26న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు 'రంగ్ దే' సినిమాకి మ‌ల్టీప్లెక్స్ ఆడియెన్స్ రూపంలో ఓపెనింగ్స్ త‌గ్గే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయని ఫిలిం సర్కిల్స్ లో అనుకుంటున్నారు.

వివరాల్లోకి వెళ్తే హాలీవుడ్ మూవీ 'కాంగ్ వ‌ర్సెస్ గాడ్జీలా' సినిమాని మార్చి 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే ట్రైలర్స్ తో ఈ సినిమా హడావిడి చేస్తోంది. ఇప్పుడు రెండు సినిమాలు ఒకే రోజు వస్తుండటంతో 'రంగ్ దే' చిత్రానికి మ‌ల్టీప్లేక్సులలో ఓపెనింగ్స్.. వీకెండ్ క‌లెక్ష‌న్స్ మీద భారీగా ప్ర‌భావం ప‌డే అవ‌కాశం ఉందని అంటున్నారు. దీనికి తోడు స్టార్టింగ్ లో ప్రచార చిత్రాలతో బ‌జ్ క్రియేట్ చేసిన మేకర్స్.. ఈ మధ్య కాస్త సైలెంట్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. మరి రిలీజ్ కి ఇంకా సమయం ఉంది కాబట్టి ఫ్యూచ‌ర్ లో జ‌నాల్ని ఆక‌ర్షించ‌డానికి ఏదైనా ప్లాన్ చేస్తారేమో చూడాలి.
Tags:    

Similar News