నిరుపేదల కోసం స్వయంగా వేలంపాటకు సిద్ధమైన హీరోయిన్..!
దేశంలో లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదల కోసం సినీతారలు వారికి తోచిన విధంగా సహాయం చేయడానికి ముందడుగు వేస్తున్నారు. ఇదివరకే చాలామంది హీరోలు హీరోయిన్లు డబ్బు రూపంలో విరాళాలు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మరో యంగ్ హీరోయన్ నేను కూడా సాయం చేస్తానంటూ ముందడుగు వేసింది. ఆమె ఎవరో కాదు.. సౌత్ ఇండస్ట్రీ బొద్దుగుమ్మ నిత్యా మీనన్. నిరుపేదల కష్టాలు కాస్త అయినా తీర్చడానికి నేను నా డ్రస్‌ను వేలం వేస్తానని ప్రకటించింది. ‘‘లాక్మే ఫ్యాషన్ వీక్‌లో నేను ధరించిన డ్రస్‌ను వేలం వేస్తున్నా. దీని ద్వారా వచ్చిన డబ్బులను అర్పణం ట్రస్ట్‌కి ఇస్తాను. ఈ ట్రస్ట్ గ్రామాల్లో పేద ప్రజలకు తమ కాళ్ల మీద తాము నిలబడానికి ప్రయత్నిస్తున్న వారికి అవసరమైన సహకారాన్ని, ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. నా కోసమే నా ఫ్రెండ్, డిజైనర్ కావేరి ఈ డ్రస్ డిజైన్ చేశారు’’ అని నిత్యా మీనన్ తెలిపింది.
ఇక ఆ వేలం.. మే 17 ఆదివారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుందని చెప్పింది నిత్య. వేలం పాటకు సంబంధించిన వివరాల్ని ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో.. @indiawasted అనే సైట్‌లో ఆక్షన్ జరగనుందని పోస్ట్ చేసింది. ఆసక్తి గలవారు ఎవరైనా ఈ వేలంపాటలో పాల్గొని డ్రెస్‌ను సొంతం చేసుకోవచ్చట. అత్యధిక ధర చెల్లించిన వారికే తన డ్రెస్ దక్కుతుందని చెప్పింది నిత్య. అంతేకాకుండా లాక్మీ ఫ్యాషన్ వీక్‌లో తాను ధరించిన డ్రెస్సుకు సంబంధించిన వీడియోను కూడా నిత్యా షేర్ చేసింది. ఇదిలా ఉండగా ఇటీవల నిత్యామీనన్ నటించిన మిషన్ మంగళ్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది. ఇక ప్రస్తుతం నిత్యామీనన్ "కోలాంబి" అనే మలయాళ చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయినట్లు వినికిడి.
Full View