లాక్ డౌన్ నుంచి లాకప్ కి చెక్
నితిన్ వరుస సినిమాలతో స్పీడు పెంచారు. ఇటీవలే వివాహం చేసుకున్న నితిన్ సినిమా విషయంలో స్పీడు పెంచేశాడు. తను నటిస్తున్న ‘రంగ్ దే’ మూవీ టాకీ పార్ట్‌ని పూర్తి చేశాడు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తోంది. పీసీ శ్రీరామ్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ మూవీ పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది.
దీంతో నితిన్ తన తదుపరి చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. నితిన్ నటిస్తున్న తాజా చిత్రం `చెక్`. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ టైటిల్ ఫస్ట్ లుక్ ని గత రెండు వారాల క్రితం చిత్ర బృందం రిలీజ్ చేసింది. రకుల్ ప్రీత్‌సింగ్,... ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. శుక్రవారం ఈ మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. నితిన్ సెట్స్‌లోక ఎంటరయ్యారు. తన సోషల్ మీడియా అకౌంట్ లలో ‘లాక్ డౌన్ టు లాకప్’ అనే ఒక పోస్టర్ ను పంచుకున్నాడు.
ఇందులో నితిన్ ఖైదీగా కనిపిస్తున్నాడు అతని పాత్ర చుట్టూ ఈ చిత్ర కథ ఆసక్తికర మలుపులతో సాగనుంది. వింక్ లేడీ నితిన్ ప్రేయసిగా కనిపిస్తుండగా రకుల్ న్యాయవాదిగా నితిన్ ని కాపాడేందుకు ఫైట్ చేసే యువతిగా కనిపించబోతోంది.