`బావ గారు బాగున్నారా!` అంటూ వరుడితో స్టెప్పులేయించిన నిహారిక
మెగా డాటర్ నిహారిక కొణిదెల గుంటూరు రేంజి ఐజీ కుమారుడు చైతన్య జొన్నలగడ్డను పెళ్లాడుతున్న సంగతి తెలిసిందే. ఈ బుధవారం సాయంత్రం ఈ జంట వివాహం రాజస్థాన్ ఉదయపూర్ లోని ఉదయ్ ప్యాలెస్ హోటల్ లో జరగనుంది. రెండు రోజుల పాటు వైభవంగా సాగే ఈ వివాహానికి పెళ్లి బృందాలు వెన్యూ వద్దకు చేరుకున్నాయి. వీరితో పాటు 120 మంది అతిథులు ఈ పెళ్లికి హాజరవుతున్నారు.
ఇప్పటికే వెన్యూ వద్ద సంగీత్ వేడుకలు అట్టహాసంగా సాగుతున్నాయి. ఉదయ్ పూర్ లో నిశ్చయ్(నిహారిక+చైతన్య) డాన్స్ - మెగా ఈవెంట్ కి సంబంధించిన వీడియోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. #NisChay అనే హ్యాష్ ట్యాగ్ తో ఇవన్నీ వైరల్ అవుతున్నాయి.
ఈ వేడుకల్లో మెగా కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారు. ఇక వేదికపై వధువు నిహారిక జోష్ ఫుల్ డ్యాన్సులు ట్రెండీగా మారాయి. నిహారికా కొణిదెలతో వరుడు చైతన్య డ్యాన్సులు చేస్తూ సందడి చేశారు. ఈ సరదా డ్యాన్స్ బిట్ వీడియో అభిమానుల్లో వైరల్ అవుతోంది. సందర్భానికి తగ్గట్టే మెగాస్టార్ `బావగారు బాగున్నారా` సాంగ్ కి కొత్త జంట స్టెప్పులేశారు.
అక్కినేని నాగ చైతన్య సమంతను వివాహం చేసుకున్నప్పుడు వారు #ChaiSam అనే హ్యాష్ ట్యాగ్ ను సృష్టించారు. విరుష్క (విరాట్-అనుష్క).. దీప్ వీర్ (దీపిక-రణవీర్) హ్యాష్ ట్యాగ్ లు ఇంతకుముందు వైరల్ అయ్యాయి. ఇప్పుడు నిశ్చయ్ ట్యాగ్ వైరల్ అవుతోంది. ఇక ఈ వేదిక వద్ద మెగా కుటుంబ సభ్యులంతా సందడి చేసారు. అల్లు అర్జున్ తన సోదరులతో కలిసి వేదిక వద్ద కనిపించారు.Full View
ఇప్పటికే వెన్యూ వద్ద సంగీత్ వేడుకలు అట్టహాసంగా సాగుతున్నాయి. ఉదయ్ పూర్ లో నిశ్చయ్(నిహారిక+చైతన్య) డాన్స్ - మెగా ఈవెంట్ కి సంబంధించిన వీడియోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. #NisChay అనే హ్యాష్ ట్యాగ్ తో ఇవన్నీ వైరల్ అవుతున్నాయి.
ఈ వేడుకల్లో మెగా కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారు. ఇక వేదికపై వధువు నిహారిక జోష్ ఫుల్ డ్యాన్సులు ట్రెండీగా మారాయి. నిహారికా కొణిదెలతో వరుడు చైతన్య డ్యాన్సులు చేస్తూ సందడి చేశారు. ఈ సరదా డ్యాన్స్ బిట్ వీడియో అభిమానుల్లో వైరల్ అవుతోంది. సందర్భానికి తగ్గట్టే మెగాస్టార్ `బావగారు బాగున్నారా` సాంగ్ కి కొత్త జంట స్టెప్పులేశారు.
అక్కినేని నాగ చైతన్య సమంతను వివాహం చేసుకున్నప్పుడు వారు #ChaiSam అనే హ్యాష్ ట్యాగ్ ను సృష్టించారు. విరుష్క (విరాట్-అనుష్క).. దీప్ వీర్ (దీపిక-రణవీర్) హ్యాష్ ట్యాగ్ లు ఇంతకుముందు వైరల్ అయ్యాయి. ఇప్పుడు నిశ్చయ్ ట్యాగ్ వైరల్ అవుతోంది. ఇక ఈ వేదిక వద్ద మెగా కుటుంబ సభ్యులంతా సందడి చేసారు. అల్లు అర్జున్ తన సోదరులతో కలిసి వేదిక వద్ద కనిపించారు.