బిబి హౌస్ లో ముద్దు వివాదం
హిందీ బిగ్ బాస్ సీజన్ 14 ఎన్నో వివాదాలను మూట కట్టుకుంది. ఈసారి కాస్త ఆలస్యంగా ప్రారంభం అయిన బిగ్ బాస్ ఎంటర్ టైన్ మెంట్ విషయంలో ప్రేక్షకులకు ముందు ఎన్నడు లేనంతగా అలరించింది అనడంలో సందేహం లేదు. వివాదాలు.. లవ్ ట్రాక్ లు.. రొమాన్స్ లు ఇలా ఈ సీజన్ మొత్తం సాగిపోయింది. సీజన్ 14 లో ఎక్కువగా నిక్కీ తంబోళి మరియు జాన్ కుమార్ సాను లు చాలా క్లోజ్ గా మెలిగారు. ఇద్దరు హౌస్ లో నడిపిన కెమిస్ట్రీ అందరి దృష్టిని ఆకర్షించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. బిబి హౌస్ లో వారి రొమాన్స్ కు అంతా ఫిదా అయ్యారు. వారిద్దరి ముద్దు ముచ్చట్లతో రేటింగ్ మరింతగా వచ్చిందని చెప్పుకోవచ్చు. హౌస్ లో ఉన్న సమయంలో ఇద్దరు అత్యంత అన్యోన్యంగా ఉన్నా బయటకు వచ్చిన తర్వాత మాత్రం వివాదాన్ని రాజేశారు.
మొదట జాన్ కుమార్ ఎలిమినేట్ అవ్వగా ఆయన బయటకు వచ్చిన నాలుగు వారాల తర్వాత నిక్కీ తంబోళి కూడా వచ్చేసింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నిక్కీ తంబోళి మాట్లాడుతూ జాన్ కుమార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. నాకు ఇష్టం లేకున్నా పదే పదే నా వద్దకు వచ్చి మాట్లాడటం తో పాటు ముద్దు పెట్టాడు. అతడిని దూరం పెట్టేందుకు ప్రయత్నించినా కూడా దగ్గరకు వచ్చే వాడు అన్నట్లుగా వ్యాఖ్యలు చేసింది. ఇష్టం లేకుండా ముద్దు పెట్టిన అతడికి సంస్కారం లేదు అన్నట్లుగా ఆమె సన్నిహితులతో చెప్పి వాపోయిందట. దాంతో ఆ విషయమై జాన్ కుమార్ స్పందించాడు. తాను హౌస్ లో ఎప్పుడు కూడా హద్దులు మీరలేదు. ఆమె ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్న ఆమె ను నేను అస్సలు ముద్దు పెట్టుకోలేదు. ఆమెతో సన్నిహితంగా ఉండటం మొత్తం కూడా కేవలం హౌస్ వరకే పరిమితం అంటూ చెప్పుకొచ్చాడు. జాన్ కుమార్ వ్యాఖ్యలపై నిక్కీ తంబోళి ఎలా స్పందిస్తుందో చూడాలి.