చెర్రీ వ‌రుణ్ క్వారంటైన్ లో ఉన్నారుగా నిహారికా!

Update: 2021-01-02 06:26 GMT
టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. రాంగ్ టైమింగ్ లో రాంగ్ పోస్టింగ్ ఎప్పుడూ అన‌వస‌ర క‌న్ఫ్యూజన్ కు వృథా చ‌ర్చ‌కు తావిస్తుంటుంది. తాజాగా ట్విట్ట‌ర్‌ లో మెగా ప్రిన్సెస్ నిహారిక (కొణిదెల‌) చైత‌న్య షేర్ చేసిన ఓ ఫోటో అంతే ప్ర‌కంప‌నాల‌కు కార‌ణ‌మైంది. ఇంత‌కీ ఈ ఫోటోలో ఉన్న ట్విస్టేమిటి? అంటే.. నిహారిక నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు చెబుతూ మెగా కజిన్స్ అంతా ఒకే ఫ్రేమ్ లో ఉన్న ఫోటో ని షేర్ చేసారు.

నిహారికా పోస్ట్ మెగాభిమానుల్లో గందరగోళానికి కార‌ణ‌మైంది. ఒక ర‌కంగా  రామ్ చరణ్ అభిమానులను కలవరపెట్టింద‌నే చెప్పాలి. ఈ ఛాయాచిత్రంలో మెగా కుటుంబానికి చెందిన యువ గ్యాంగ్ ఉన్నారు. రామ్ చరణ్ - అల్లు అర్జున్- వరుణ్ తేజ్- క‌ళ్యాణ్ దేవ్- అల్లు శిరీష్- బాబీ త‌దిత‌రులు ఉన్నారు. ఈ ఫోటోని కొంద‌రు ఔత్సాహిక‌ అభిమానులు `లాస్ట్ నైట్ న్యూ ఇయర్` పార్టీ నుండి అంటూ తాజాగా ట్రెండ్ చేయడం ప్రారంభించారు.

నిజానికి ఇది సాధ్య‌మేనా?  ఓవైపు రామ్ చ‌ర‌ణ్‌.. వ‌రుణ్ తేజ్  కరోనా వైరస్ మ‌హ‌మ్మారీకి చికిత్స పొందుతున్నారు. అలాంట‌ప్పుడు వీళ్లు ఈ ఫోటోలో ఎలా క‌నిపిస్తారు? ప‌్ర‌స్తుతం స్వీయ‌నిర్భంధంలో ఉన్నారు క‌దా! అన్న చ‌ర్చా సాగింది. నిజానికి ఈ ఛాయాచిత్రం న్యూ ఇయర్ పార్టీ నుండి విడుద‌లైన‌ది కాదు. గత నెలలో ఉదయపూర్ ‌లో జరిగిన నిహారికా వివాహ వేడుకల్లోనిది. చరణ్ - వరుణ్ తేజ్ బ్ర‌ద‌ర్స్ కరోనావైరస్ బారిన పడటానికి చాలా ముందు తీసిన‌ ఫోటో ఇది. అయితే చాలా మంది అభిమానులు క‌న్ఫ్యూజ‌న్ కి లోన‌య్యి కొత్త సంవ‌త్స‌ర వేడుక‌ల నుంచి అంటూ భ్ర‌మించారు.
Tags:    

Similar News