మెగా ఫ్యామిలీ వీడియో చూసుకొని మురిసిపోతున్న మెగా ఫ్యాన్స్...!

Update: 2020-08-16 04:00 GMT
మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ఏకైక కుమార్తె నిహారిక కొణిదెల‌ నిశ్చితార్థం ఇటీవల హైద‌రాబాద్‌ లో గ్రాండ్ గా నిర్వహించిన విష‌యం తెలిసిందే. గుంటూరు జిల్లాకు చెందిన ఐజీ జొన్న‌ల‌గ‌డ్డ ప్ర‌భాక‌ర్ రావు త‌న‌యుడు జొన్న‌ల‌గ‌డ్డ వెంక‌ట చైత‌న్య‌తో మెగా డాటర్ ఎంగేజ్మెంట్ ఇరు కుటుంబ సభ్యుల స‌మ‌క్షంలో జ‌రిగింది. ఈ నిశ్చితార్ధం వేడుక‌కు పవన్ కళ్యాణ్ తప్ప మెగా ఫ్యామిలీలోని అందరూ హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. ఇక ఈ ఎంగేజ్మెంట్‌ కు చెందిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ నేపథ్యంలో నాగబాబు తన ముద్దుల కూతురు నిశ్చితార్థం జరిగిన సందర్భంగా ట్విట్టర్ లో.. ''డియ‌ర్ చై.. దాదాపు అన్ని విష‌యాల్లోనూ త‌ను అచ్చం నాలాగే ఉంటుంద‌ని అంతా అంటుంటారు. త‌న‌పై ఈ ప్ర‌పంచంలోని ప్రేమ‌నంతా నువ్వు కురిపిస్తావ‌ని న‌మ్ముతున్నా. ఈ రోజు నుంచి త‌ను నీ స‌మ‌స్య‌గా మారిపోయింది'' అంటూ త‌న‌కు కాబోయే అల్లుడు చైత‌న్య‌ను ఉద్దేశించి ఆత్మీయ ట్వీట్ చేశారు. అంతేకాకుండా తన కూతురు నిహారికకు ఉద్దేశిస్తూ.. ''కుమార్తెలు నీటిలో మన ప్రతిబింబం లాంటి వారు. మనం ఎంత ఎక్కువగా పట్టుకోవాలని చూస్తే అంత ఎక్కువ అలలు క్రియేట్ అవుతాయి. అందుకే వారిని వాళ్ళలాగే ఉండనివ్వండి. వారు పెరిగే క్రమంలో ప్రతి క్షణాన్ని ఆనందించండి. లవ్ యూ నిహా'' అని ట్వీట్ చేసారు.

ఈ క్రమంలో నిహారిక - చైతన్య ల ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఓ వీడియోను నాగబాబు తన యూట్యూబ్ ఛానెల్‌ లో విడుదల చేసారు. నిహారిక - చైతన్య నిశ్చితార్ధ ఫోటోలతో ఈ వీడియో క్రియేట్ చేయబడింది. ఈ వీడియోలో చిరంజీవి, సురేఖ‌, నాగబాబు, రామ్ చ‌ర‌ణ్, ఉపాస‌న‌, అల్లు అర్జున్, స్నేహ రెడ్డి, వరుణ్ తేజ్, సాయి ధ‌ర‌మ్ తేజ్, వైష్ణవ్ తేజ్, కళ్యాణ్ దేవ్, శ్రీజ త‌దిత‌రులు నిహారిక - చైతన్య లతో కలిసి ఉన్న ఫోటోలు జతచేయబడి ఉన్నాయి. మెగా ఫ్యామిలీ మొత్తం ఈ వీడియోలో కనిపించడంతో మెగా ఫ్యాన్స్ కి ఈ వీడియో కన్నుల పండుగలా ఉంది. అయితే పవన్ కళ్యాణ్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని.. ఆయన కూడా ఉంటే ఇంకా బాగుండేదని వారు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తం మీద ఈ లాక్ డౌన్ లో మెగా హీరోల సినిమాలు కూడా లేకపోవడంతో మెగా అభిమానులు ఈ వీడియో చూసుకుంటూ సంబరపడిపోతున్నారు.
Full View
Tags:    

Similar News