మేడం ఒక్క సెల్ఫీ.. ‘నిధి’ని చుట్టుముట్టిన ఫ్యాన్స్

Update: 2020-12-21 07:15 GMT
‘ఇస్మార్ట్’ హీరోయిన్ నిధి అగర్వాల్ ను ఫ్యాన్స్ చుట్టుముట్టారు. ఒక్క సెల్ఫీ మేడం రిక్వెస్ట్ చేశారు.. మరికొందరు ఆమెను టచ్ చేసేందుకు ప్రయత్నించారు.. వారిని అదుపు చేసేందుకు బౌన్సర్లు కష్టపడాల్సి వచ్చింది.

నిధి అగర్వాల్.. ప్రస్తుతం అశోక్‌ గల్లా డెబ్యూ మూవీలో నటిస్తోంది. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ లేటెస్ట్ గా రాజమహేంద్రవరంలో జరిగింది. ఈ షెడ్యూల్‌లో నిధి పాల్గొన్నారు. అయితే.. తమ అభిమాన నటి వచ్చిందని తెలుసుకున్న అభిమానులు అధిక సంఖ్యలో షూటింగ్‌ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లారు.

అయితే.. అభిమానుల తాకిడి ఎక్కువవడంతో కాస్త ఇబ్బందులకు గురైంది నిధి. ఆమె చుట్టూ బౌన్సర్లు ఉన్నప్పటికీ.. కొంత మంది ఆమెతో సెల్ఫీలు దిగేందుకు ముందుకు వచ్చారు. మరికొందరు ఆకతాయిలు ఆమెను టచ్ చేయాలని చూశారు. వారందరినీ దాటుకుని ఆమె వాహనం ఎక్కినప్పటికీ.. వెహికిల్ ను కూడా చుట్టుముట్టి కాసేపు హంగామా చేశారట ఫ్యాన్స్.

ఇస్మార్ట్ శంకర్ సినిమాలో రెండో హీరోయిన్ గా ఈ అమ్మడు నటించిన విషయం తెలిసిందే. న్యూరో సైంటిస్ట్ పాత్ర పోషించిన ఈ బ్యూటీ.. అభిమానులను అలరించింది. ప్రస్తుతం చేస్తున్న ఈ మూవీ ద్వారా ఫ్యాన్స్ కు మరింత చేరువై, టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలను చేజిక్కించుకోవాలని చూస్తోంది. మరి, ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.
Tags:    

Similar News