నటి సౌజన్య ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్ .. ఏమిటంటే

Update: 2021-10-02 09:31 GMT
సంచలనం రేపిన కన్నడ నటి సౌజన్య సూసైడ్ కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. తమ కుమార్తెది ముమ్మాటికీ హత్యేనని అంటున్నారు ఆమె పేరెంట్స్. నటుడు వివేక్ పై తమకు అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సౌజన్య మృతి తర్వాత ఇంట్లో డబ్బులు, బంగారం కనిపించడం లేదని కూడా ఫిర్యాదులో పొందుపరిచారు. వివేక్ ప్రేమ పేరుతో సౌజన్యను ఏడాదిగా వేధిస్తున్నాడని అంటున్నారు ఆమె పేరెంట్స్. ఇటు తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించిన వివేక్.. సౌజన్య తనకు ఏడాదిగా తెలుసని చెబుతున్నాడు. ఆమె తరచూ ఒత్తిడికి గురవుతుందని, ఆ సమయంలో తన బాధను చెబుతూ ఉండేదని అంటున్నాడు. వీరిద్దరూ కలిసి ఓ సీరియల్ లో నటించారు. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.

తన చావుకు ఎవరూ బాధ్యులు కారని, తానేనంటూ సౌజన్య ఫ్లాట్ లో సూసైడ్ నోట్ దొరికింది. కుటుంబ‌స‌భ్యులు, స్నేహితులు త‌న‌ను క్ష‌మించాల‌ని కోరింది. తీవ్ర మానిసక క్షోభతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపింది. కర్నాట‌కలోని కొడ‌గు జిల్లాకు చెందిన సౌజన్య అసలు పేరు సావి మ‌డ‌ప్ప. బెంగ‌ళూరు పరిధిలోని దొడ్డ‌బెలేలో ఉంటోంది. నటుడు వివేక్, అసిస్టెంట్ మహేష్‏లపై కంబళగోడు పోలీస్ స్టేషన్ ‏లో ఫిర్యాదు చేశాడు నటి సౌజన్య తండ్రి. అంతేకాకుండా.. తన కూతురు అమాయకురాలు అని ఎలాంటి తప్పు చేయలేదని ఫిర్యాదులో పేర్కో్న్నాడు. తన కూతురు దగ్గర ఉన్న బంగారం, డబ్బులు కనిపించడం లేదని తెలిపాడు, అలాగే ఒకవేళ తన కూతురు నిజాంగానే ఆత్మహత్య చేసుకుంటే, మహేష్ అక్కడే ఉండకుండా ఎందుకు పారిపోయాడని తన కూతురు మృతదేహం వద్ద ఎందుకు ఉండలేదని ప్రశ్నించారు. అలాగే తన కూతురు ఫోన్ కూడా కనిపించడం లేదని, ఫోన్ దొరికితే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు.

దీంతో కుంపలగోడు పోలీసులు సౌజన్య తల్లిదండ్రుల సమక్షంలో ఆమె నివసించే అపార్ట్‏మెంట్ మొత్తాన్ని మరోసారి తనిఖీ చేశారు. అనంతరం ఆమె మృతదేహాన్ని పోస్ట్‏మార్టం అనంతరం తల్లిదండ్రులకు అప్పగించారు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆమె నాలుగు పేజీల సూసైడ్ నోటి రాసింది. అందులో తన మానసిక స్థితి బాగలేదని.. ప్రస్తుతం ఒత్తిడి తాను భరించలేకున్నాను అని పేర్కోంది. అయితే ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.


Tags:    

Similar News