కొత్త కాంబోలతో కొడుతున్నారు
ప్రతీ సినిమాతో కొత్తదనం చూపించాలని కోరుకోవడం కామనే కానీ.. ఇప్పుడు రాబోతోన్న సినిమాల్లో కొత్త కొత్త కాంబినేషన్లు కూడా సెట్ అయ్యాయి. ముఖ్యంగా చాలామంది హీరోహీరోయిన్లు మొదటి సారిగా జంట కడుతున్నవే కావడం విశేషం. సమ్మర్ కి రిలీజ్ షెడ్యూల్ చేసినవాటితో పాటు.. ఆ తర్వాత రానున్న చిత్రాల్లోనూ ఇలాంటి న్యూ కాంబోలు కనిపించనున్నాయి.
సర్దార్ గబ్బర్ సింగ్ మూవీలో తొలిసారిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - టాలీవుడ్ చందమామ కాజల్ జోడీ కట్టారు. అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ కాంబినేషన్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. బ్రహ్మోత్సవంలో తొలిసారిగా కన్నడ బ్యూటీ ప్రణీతతో ఆడిపాడుతున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ మూవీలో సమంత - కాజల్ కూడా ఉన్నా.. ప్రణీతతో సూపర్ స్టార్ కెమిస్ట్రీపై ఆసక్తి నెలకొంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మొదటిసారి రకుల్ ప్రీత్ సింగ్ తో జోడీ కట్టాడు. సరైనోడు మూవీలో ఈ జంట కనువిందు చేయనున్నారు.
కుర్ర హీరో నితిన్ - సౌత్ సోయగం సమంత.. మొదటిసారిగా అ..ఆ.. చిత్రం ద్వారా కలిసి కెమిస్ట్రీ పండిస్తున్నారు. ఇవన్నీ సమ్మర్ లో రానున్న సినిమాలైతే.. ఆ తర్వాత విడుదలయ్యే సినిమాల్లోనూ ఈ ట్రెండ్ కంటిన్యూ కానుంది. ప్రేమమ్ చిత్రంలో అక్కినేని నాగచైతన్య - శృతిహాసన్ కలిసి నటిస్తున్నారు. కొరటాల శివతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న జనతా గ్యారేజ్ లో నిత్యా మీనన్ ఓ హీరోయిన్ గా నటిస్తోంది. మొత్తం మీద జనాలపై కొత్త కాంబినేషన్ లపై దండెత్తుతున్న టాలీవుడ్ సినిమాలు జాబితా పెరుగుతోంది.