నేను లోకల్.. రిలీజ్ డేట్ ఇచ్చేశారోచ్

Update: 2017-01-20 11:46 GMT
సంక్రాంతికి భారీ అంచనాల మధ్య ఖైదీ నెంబర్ 150.. గౌతమీపుత్ర శాతకర్ణి విడుదలయ్యాయి. అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులనూ అలరించాయి. ఇక తెలుగులో ఇలాంటి భారీ సినిమాలు రావడానికి సమయం పడుతుంది. వేసవి వరకు అంత భారీ సినిమాలేమీ లేవు. మీడియం రేంజి సినిమాలతోనే సరిపెట్టుకోవాలి. వాటిలో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న చిత్రాల్లో ‘నేను లోకల్’ ఒకటి.

వరుసగా ఐదు హిట్లు కొట్టి డబుల్ హ్యాట్రిక్ మీద నిలిచిన నాని నటించిన సినిమా కావడంతో ‘నేను లోకల్’పై అంచనాలు భారీగానే ఉన్నాయి. పైగా దీని ట్రైలర్ కూడా సినిమాపై భలే ఆసక్తి రేకెత్తించింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడూ రిలీజవుతుందా అని ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. వారి నిరీక్షణకు ఫిబ్రవరి 3న తెరపడనుంది. ఆ రోజే ‘నేను లోకల్’ రిలీజవుతుందని దిల్ రాజు ప్రకటించాడు.

ముందు అనుకున్న ప్రకారమైతే ‘నేను లోకల్’ డిసెంబరు 23నే రావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. మంచి టైమింగ్ చూసి సినిమాను రిలీజ్ చేయాలని భావించిన రాజు.. ‘నేను లోకల్’ ఆడియో వేడుకలో కూడా విడుదల తేదీ ప్రకటించలేదు. ఫిబ్రవరిలో రిలీజయ్యే సినిమాలన్నింటి పైనా ఓ అంచనాకు వచ్చాక మూడో తారీఖున తన సినిమాను ఫిక్స్ చేసుకున్నాడు. అదే రోజు మంచు విష్ణు సినిమా ‘లక్కున్నోడు’ కూడా రిలీజవుతున్నప్పటికీ రాజు దాని గురించేమీ ఆలోచించకుండా తన సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసేశాడు. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాని సరసన కీర్తి సురేష్ కథానాయికగా నటించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News