రానా మందుకి.. తేజు వెనక్కి

Update: 2017-06-28 04:55 GMT
మన దేశంలో సెలవులు వస్తే సినిమా.. పండుగ వస్తే సినిమా.. సంబరాలు జరుపుకోవాలి అంటే కావలిసింది సినిమా. అందుకే సినిమాలు కూడా సంక్రాంతికి - దసరాకి - దీపావళికి లేకపోతే వేసవి సెలవులలో విడుదల అవుతూ ఉంటాయి. ఇప్పుడు సినిమా విడుదల చేసేవారు అలా ఆలోచించడం మానేశారు. ఎందుకంటే ఇప్పుడు మనదేశంలో పండుగ అంటే వీకెండ్ అని ఒక కొత్త ఆచారం వచ్చింది కాబట్టి. అందుకే విడుదల చేసేవారు కూడా వీకెండ్లలో విడుదల చేస్తున్నారు.

ఆగష్టులో వచ్చే ఇండిపెండెన్స్ డే రెండు వీకెండ్ల మధ్య రావడంతో తెలుగు సినిమాలు కొన్ని అదే వారం విడుదల చేయడానికి సిద్దం చేస్తున్నాయి. బోయపాటి శ్రీను డైరక్షన్లో వస్తున్న ‘జయ జానకి నాయక’ ఆగష్టు 11 న విడుదల అవుతుంది. మరో యంగ్ హీరో నితిన్  నటిస్తున్న హను రాఘవపూడి  డైరక్షన్లో  ‘లై’ సినిమా కూడా అదే రోజున విడుదల చేస్తున్నారు. అలాగే రానా - కాజల్ - కేథరిన్ నటిస్తున్న తేజ డైరక్షన్లో వస్తున్న ‘నేనే రాజు నేనే మంత్రి’  సినిమా కూడా అప్పుడే విడుదల చేద్దాం అనుకున్నారు. కానీ అన్నీ సినిమాలు మధ్య అనవసర పోటీ ఏర్పడి కలెక్షన్ల పై ప్రభావం చూపుతుంది అని గ్రహించి ఆగష్టు 4కు విడుదల  ఫిక్స్ చేసుకున్నారు. అలాగే మరో యంగ్ మెగా హీరో సాయ్ ధరమ్ తేజ్ నటిస్తున్న బివియెస్ రవి డైరెక్ట్ చేస్తున్న ‘జవాన్’ సినిమా విడుదల తేది కూడా మార్చుకున్నారు. హీరో తేజ్ కు జవాన్ ముఖ్యమైన సినిమానే - అందుకని ఆగష్టు 11 నాడు కాకుండా ఆగష్టు 18 కు ముహూర్తం పెట్టుకున్నారు.

బాక్స్ ఆఫీసు బిజినెస్ బాగా తెలిసిన సురేశ్ బాబు - దిల్ రాజు అంచనా వేసి ఆటు మార్చి సినిమాను స్థిరంగా విజయం వైపు వెళ్ళే విదంగా ప్లాన్ వేశారు. ‘జవాన్’ సినిమా దిల్ రాజు సమర్పణ లో విడుదల అవుతుంది. ‘నేనే రాజు నేనే మంత్రి’ సురేశ్ బాబు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. అది సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News