ట్రైలర్ టాక్: నీవెవరో లో చంపిందెవరో?

Update: 2018-08-12 12:27 GMT
అది పినిసెట్టి తాజా చిత్రం 'నీవెవరో' ట్రైలర్ ఈరోజే రిలీజ్ అయింది. ఒకరిన్నర నిముషం నిడివి గల ఈ ట్రైలర్ లో ఆది పాత్ర 'కళ్యాణ్' ను ఒక ఫేమస్ మాస్టర్ చెఫ్ గా చూపించారు.  15 ఏళ్ళ వయసులోనే చూపు పోగొట్టుకున్నా ఆత్మవిశ్వాసం మాత్రం పోగొట్టుకోలేదని జీవితం లో ఎంతో సాధించాడని ఇంట్రో ఇస్తారు.  ఆది రితిక సింగ్ - తాప్సీ లతో ఉండే లవ్ సీన్స్ కూడా చూపించారు.  అంధుడయినా సూపర్ గా ఫైట్లు చేస్తుంటాడు.  అంతలో ట్విస్ట్... కళ్యాణ్ ను ఎవరో చంపేస్తారు. యాక్సిడెంట్ అనిపించేలా ఉన్నా అది మర్డర్.

ఇంతవరకూ ఒక ఎత్తైతే ఈ ముర్దర్ కేస్ సాల్వ్ చేసే పోలీస్ ఆఫీసర్ గా వెన్నెల కిషోర్ కనిపించాడు.  అంతలో క్రైమ్ రిపోర్టర్ అంటూ ఇంకో ఆది ని పరిచయం చేస్తాడు.  మరి ఆది డబుల్ రోల్ చేశాడా అనేది క్లారిటీ ఇవ్వలేదు గానీ ఈ ఆదికి మాత్రం చూపు ఉంది.  ఎందుకంటే ఎఫ్ ఐ ఆర్ కాపీ చదువుతూ 'గుద్దిన కార్ కు విండ్ షీల్డ్ పగిలందని రాసి ఉంది' అనే డైలాగ్ చెప్తాడు.  సో.. దీని ప్రకారం చూస్తే ఒక ఆది మర్డర్ కేస్ ను మరో ఆది సాల్వ్ చేస్తాడన్నమాట!
Read more!

ప్రొడక్షన్ వ్యాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.  విజువల్స్ - బ్యాక్ గ్రౌండ్ స్కోర్ - స్టంట్స్ అన్నీ టాప్ క్వాలిటీ.  చూస్తుంటే 'నీవెవరో' తో ఆది ఆడియన్స్ ను మంచి మర్డర్ మిస్టరీ తో థ్రిల్ చేసేలా ఉన్నాడు.  హరినాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను ఎంవీవీ సత్యనారాయణ - కోన వెంకట్ నిర్మించారు. మీరు కూడా ట్రైలర్ పై ఓ లుక్కేయండి.

వీడియో కోసం క్లిక్ చేయండి


Full View
Tags:    

Similar News