• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బిచ్చగాడు.. మొత్తం...

బిచ్చగాడు.. మొత్తం ఊడ్చేశాడే

By - Tupaki Desk
Update: 2017-12-09 07:35 GMT
కొన్నిసార్లు సినీ పరిశ్రమలో కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి. గత ఏడాది ‘బిచ్చగాడు’ కూడా అలాంటి అద్భుతమే చేసింది. ఈ సినిమా ఆ స్థాయిలో సంచలనం రేపుతుందని ఎవ్వరూ ఊహించలేదు. అది రిలీజైన టైమింగ్ దానికి అలా కలిసొచ్చింది. మరో సమయంలో రిలీజైతే ఆ సినిమా అలాగే ఆడేసేదా అంటే సందేహమే. ఈ సినిమా సాధించిన సంచలన విజయంతో విజయ్ ఆంటోనీపై మన నిర్మాతల కళ్లు పడ్డాయి. ఆ తర్వాత అతను నటించిన ప్రతి సినిమానూ మంచి రేటుకు కొని రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. ‘బేతాళుడు’ నిరాశ పరిచినప్పటికీ ‘బిచ్చగాడు’ ప్రభావం వల్ల దానికి ఓపెనింగ్స్ బాగానే వచ్చింది. కానీ ఆ తర్వాత వచ్చిన ‘యమన్’ గట్టి దెబ్బ తీసింది.

ఇప్పుడు ‘ఇంద్రసేన’ సినిమా నీలం కృష్ణారెడ్డికి మామూలు దెబ్బ కాదు. గత సినిమాల ఫలితాల్ని పట్టించుకోకుండా రూ.2.25 కోట్లు పెట్టి సినిమాను కొన్నాడాయన. రాధిక శరత్ కుమార్ కూడా ఈ సినిమాలో భాగస్వామి కావడం, ట్రైలర్ బాగుండటంతో టెంప్ట్ అయ్యాడు. కానీ ఇప్పుడు సినిమా చూస్తే దారుణమైన ఫలితాన్ని అందుకుంది. ఈ సినిమాకు ఓపెనింగ్స్ లేవు. పైగా పూర్తి నెగెటివ్ టాక్ రావడంతో ఆ తర్వాత కూడా పుంజుకోలేదు. కేవలం రూ.55 లక్షల డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చిందీ సినిమాకు. అంటే పెట్టుబడిలో 25 శాతం కూడా వెనక్కి రాలేదన్నమాట. ఈ దెబ్బతో విజయ్ ఆంటోనీ ‘బిచ్చగాడు’తో తెచ్చుకున్న గుర్తింపు.. మార్కెట్ అన్నీ కూడా పోయినట్లే ఉన్నాయి. ఇకపై అతడి సినిమాల్ని ఎగబడి కొనే పరిస్థితి ఉండకపోవచ్చు.

Tags:    
  • Neelam Krishna Murthy 
  • Indrasena Movie 

Similar News

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS