నయన్ మళ్లీ బీర్ బాటిల్ ఎత్తింది
వయసు పెరుగుతోన్న కొద్ది నయనతార కు క్రేజ్ విపరీతంగా పెరుగిపోతుంది. స్టార్ హీరోల సినిమాల్లో నటించి తన హవా ఇంకా చాటుతూనే ఉంది. అటు ఎఫైర్లలో టాప్ ప్లేస్ లో కొనసాగుతుంది. అయితే ఇవన్నీ ఒక ఎత్తైతే ఈ బీర్ బాటిళ్ల గోల మరో ఎత్తైంది. ఆ మధ్య నానుం రౌడీదాన్ సినిమా కోసం అమ్మడు బీర్ బాటిల్ కొనే ఓ సన్నివేశంలో నటించింది. దీంతో మహిళా సంఘాలు సొగసరిపై భగ్గుమన్నాయి. బాధ్యతగల మహిళగా వ్వవహరించాల్సింది పోయి ఇలా యువతను తప్పుడు దోవ పట్టిచే సన్నివేశాల్లో నటిస్తుందా? అంటూ విమర్శలు ఎదుర్కుంది. అయినా నయన్ ఆ విషయాలను అప్పుడే మర్చిపోయిందని ఇప్పుడు బయట పడింది.
ఎందుకంటే మరోసారి బీర్ బాటిల్ ఎత్తడానికి సిద్ధమైంది. ప్రస్తుతం ఈ అమ్మడు జీవా సరసన తిరునాల్ అనే సినిమాలో నటిస్తోంది. ఇందులో కూడా బీర పట్టుకుని ఉన్న కొన్ని ఫోటోలు ఇప్పుడు నెట్ లో హల్ చేస్తున్నాయి. కథలో ఆ సన్నివేశానికి ప్రాధాన్యత ఉండటంతోనే నయన్ బీర్ బాటిల్ ఎత్తడానికి సిద్ధపడిందని తెలుస్తుంది. అయితే యూనిట్ వర్గాలు మాత్రం ఆ సన్నివేశం నయనతారకు సంబంధించినది కాదని అంటున్నారు. ఏది ఏమైనా నయన్ ఇలా బీర్ బాటిల్ తో కనిపించడంతో మళ్లీ విమర్శలు వెల్లు వెత్తడం ఖాయమని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా నయన్ బీర్ బాటిల్ లేపిందంటే ఆ సినిమా హిట్లే అనే సెంటిమెంటుకు తంబీలు వచ్చేసుంటారు.