నయన్ పేరు చెప్పి రిలీజ్ చేస్తున్నారు
హీరోకో లేదా హీరోయిన్ కో వాళ్లకున్న క్రేజ్ ని బట్టి పక్క భాషల్లో చేసిన సినిమాలను డబ్బింగ్ చేసి తీసుకురావడం తెలుగులో కొత్తేమి కాదు. ఒకోసారి ఇక్కడ ఆల్రెడీ హిట్ అయినవి అక్కడ రీమేక్ అయితే మళ్ళీ డబ్బింగ్ కొట్టి ప్రేక్షకులను బురిడీ కొట్టించిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. నయనతారకు తమిళ్ లోనే కాదు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆ కారణంగానే ఐరా లాంటి మూవీస్ ని రెండు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేశారు. అఫ్ కోర్స్ ఫలితం తేడా కొట్టింది అది వేరే సంగతి.
వచ్చే నెల రానున్న మెగాస్టార్ సైరాలో హీరోయిన్ గా నయనతార మరోసారి స్ట్రెయిట్ గా తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. ఆలోగానే తన తమిళ సినిమా మనవాళ్లకు టేస్ట్ చేయించే ప్రయత్నాలు చేస్తున్నారు మన నిర్మాతలు. సెప్టెంబర్ 6న వీడే సరైనోడు అనే డబ్బింగ్ మూవీ రిలీజవుతోంది. రంగం ఫేమ్ జీవా హీరో. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో లవ్ అండ్ వయొలెన్స్ ని బేస్ చేసుకుని పిఎస్ రామనాథ్ దర్శకత్వంలో రూపొందిన తిరునాళ్ కు ఇది అనువాద రూపం.
అలా అని ఇదేదో కొత్త సినిమా అనుకునేరు. మూడేళ్ళ క్రితం 2016లో తమిళ్ లో రిలీజై రొటీన్ ట్రీట్మెంట్ కారణంగా అంతగా వర్క్ అవుట్ కాలేదు. ఇప్పుడు దీన్నే వీడే సరైనోడు పేరుతో డబ్ చేసి వదులుతున్నారు. మాస్ సెంటర్స్ లో బిసి కేంద్రాల్లో ఎంతోకొంత వర్క్ అవుట్ కాకపోదా అన్న నమ్మకం కావొచ్చు. మొత్తానికి కేవలం నయన్ బ్రాండ్ నే నమ్ముకుని వస్తున్న ఈ వీడే సరైనోడు ఏ మేరకు మెప్పిస్తుందోచూడాలి