• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సౌత్ ఇండియన్ రెమ్యూనరేషన్...

సౌత్ ఇండియన్ రెమ్యూనరేషన్ క్వీన్ ఆమే..

By - Tupaki Desk
Update: 2016-11-22 19:30 GMT
హీరోయిన్ 30 ప్లస్ లోకి పడిందంటే ఇక ఆమె కథ ముగిసినట్లే అనుకుంటారు మామూలుగా. కానీ నయనతార మాత్రం ఇందుకు భిన్నం. 32 ఏళ్ల వయసులోనూ ఆమె జోరు మామూలుగా లేదు. వరుస హిట్లతో దూసుకెళ్లిపోతోంది ఈ మలయాళ కుట్టి. దాదాపు అరడజను క్రేజీ ప్రాజెక్టులు ఆమె చేతిలో ఉన్నాయి. హీరోల్లాగా సినిమాను తన భుజాల మీద మోయగల సత్తా ఆమె సొంతం. అందుకే ఆమె ప్రధాన పాత్రలో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కూడా వరుస కడుతుున్నాయి. ఈ చిత్రాలకు ఆమె పారితోషకం కూడా భారీగానే ఉంటోంది. సౌత్ ఇండియలో మరే కథానాయికా అందుకోని రెమ్యూనరేషన్ మార్కును నయనతార అందుకుంది.

‘ఈనాడు’ ఫేమ్ చక్రి తోలేటి దర్శకత్వంలో యువన్ శంకర్ రాజా నిర్మించనున్న హార్రర్ థ్రిల్లర్ ‘కోలైయుదిర్ కాలం’ సినిమాకు నయనతార ఏకంగా రూ.3 కోట్ల పారితోషకం తీసుకుంటోందట. సౌత్ ఇండియాలో ఇప్పటిదాకా ఎవరూ 3 కోట్ల మార్కును టచ్ చేయలేదు. ‘బిల్లా’ సినిమాకు రూ.1.5 కోట్ల మార్కును అందుకుని అప్పట్లో రికార్డు సృష్టించిన నయన్.. ఆ తర్వాత రూ.2 కోట్లు.. రూ.2.5 కోట్ల మార్కును కూడా తనే బ్రేక్ చేసింది. ఇప్పుడు ఏకంగా రూ.3 కోట్లు తీసుకుంటోంది. గత ఏడాది నయన్ నటించిన హార్రర్ మూవీ ‘మయూరి’ సూపర్ హిట్ కావడంతో నయన్ ను నమ్ముకుని ఈజీగా రూ.10 కోట్లు పెట్టేసి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి రెడీ అయిపోతున్నారు నిర్మాతలు. నయన్ వాటా కూడా అందుకు తగ్గట్లే భారీగా ఉంటోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Nayanthara 
  • Remuneration 
  • Telugu NEWs 

Similar News

బ్లాక్ శారీలో తృప్తి డిమ్రీ మెరుపులు.. దీపావళి పార్టీ లుక్ వైరల్!

2026-11-08 06:11 GMT

పెద్ద రహస్యం బయటపెడతాను అంటున్న స్టార్ హీరో..!

2026-11-08 06:01 GMT

దర్శకుడిగా రాపిడో డ్రైవర్.. అసలు విషయం చెప్పిన వెంకీ కుడుముల

2026-11-08 05:48 GMT

శ్రీలీల కీలక నిర్ణయం.. ఇక ఈ హీరోయిన్ జోరు ఆపేవాళ్ళు ఎవరు గురు..!

2026-11-08 05:46 GMT

రావణుడిగా ప్రభాస్…అంత ఘోర అవమానం తరువాత ఇది అవసరమా..!

2026-11-08 04:55 GMT

మణిరత్నం.. చిరంజీవి..ఓ తమిళ దళపతి..!

2026-11-08 04:54 GMT

రామాయణం తీస్తూ రాముడినే మర్చిపోయారా?

2026-11-08 04:54 GMT

9వ వారం ఎలిమినేషన్ క్యాన్సిల్!

2026-11-08 04:43 GMT

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

Copyright @2026

Powered by Blink CMS