నయన్ పోలీస్ అవతారం చూపిస్తోందట

Update: 2016-07-27 07:32 GMT
సౌత్ సినిమాకి టాప్ బ్యూటీ నయనతార.. ఇప్పటికే చాలా రకాల కేరక్టర్లతో మెప్పించేసింది. పాత్ర ఏదైనా.. తన స్టైల్ యాక్టింగ్ - పెర్ఫామెన్స్ ప్లస్ గ్లామర్ డోస్ తో  పిచ్చెక్కించేయడం నయన్ కి బాగా వచ్చిన విద్య. ప్రస్తుతం ఈ భామ చేతిలో చాలానే సినిమాలున్నాయ్ కానీ.. ఇందులో రిలీజ్ కి రెడీగా ఉన్న మూవీ ఇరుమగన్. తెలుగులో ఇంకొక్కడు పేరుతో వస్తున్న ఈ మూవీలో.. నయన్ రోల్ గురించి ఇప్పుడో ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది.

ఇరుమగన్ లో నయన్ చేస్తున్నది పోలీస్ పాత్ర అనే విషయం ఇప్పుడు బైటకొచ్చింది. ఈ విషయం తెలిసి అందరూ షాక్ తినేశారు. పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్న నయన్.. ఇరుగమన్ స్టోరీ చెప్పగానే అందుకే ఒప్పేసుకుందట. అంతే కాదు.. ఫైటింగ్ సీన్స్ లోనూ నయన్ సత్తా  చూపించిందనే టాక్ వినిపిస్తోంది. ఇరుమగన్ రిలీజ్ తర్వాత నయనతార ఇమేజ్ ప్లస్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోతాయని దర్శకుడు చెబుతున్నాడు.

ఫైటింగుల విషయంలో అయితే.. అప్పట్లో లేడీ అమితాబ్ విజయశాంతిని మరిపించేసిందని యూనిట్ వర్గాలు అంటున్నాయి. ఇన్నాళ్లూ ఇరుమగన్ పోస్టర్లలో నయన్ ని అల్ట్రా గ్లామర్ తో పొట్టి గౌనుల్లో చూపిస్తుంటే.. ఇది గ్లామరస్ రోల్ అనుకున్న జనాలు.. ఇప్పుడు పోలీస్ పాత్ర అని తెలిసి షాక్ తినేస్తున్నారు.
Tags:    

Similar News