రామ్, నయన్. ఒక గూటి పక్షులు..

Update: 2016-01-18 11:30 GMT
టాలీవుడ్ హీరో రామ్ - మళయాళీ భామ నయనతారతో పోలికేంటి అనిపిస్తుంది కదూ. వీళ్లిద్దరూ ఒకే సినిమాలో కలిసి కూడా చేయలేదుగా మరి కంపేరిజన్ ఎలా అనుకోవచ్చు. కానీ ఓ విషయంలో మాత్రం రామ్ - నయన్ లు ఒకే ట్రెండ్ ఫాలో అవుతుంటారు. కావాలని కాకపోయినా, ఇద్దరికీ మాత్రం ఓ విషయంలో పోలికలు బోలెడు ఉన్నాయి.

లుక్స్.. అదేనండీ గెటప్ లుక్స్ విషయంలో మాత్రం రామ్ - నయనతారలు ఒకేలా ఉంటారు. అది ఏ సినిమా అయినా, ఓ కాన్సెప్ట్ అయినా కొంచెం కూడా ఛేంజ్ చూపించేందుకు ట్రై చేయరు. ఒకే ఒక్క సారి రామ్ చూపించన మార్పు ఏంటంటే మీసం తీసేయడం అంతే. మసాలా మూవీ క్లిక్ కాలేదన ఆ మాత్రం ప్రయత్నం కూడా మళ్లీ మానేశాడు. ఇప్పుడు ముమ్ముట్టి హీరోగా నయనతార హీరోయిన్ గా ఓ మూవీ షూటింగ్ జరుపుకుంటోంది. పుతియ నియమం పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఏకే సాజన్ డైరెక్టర్. ఈ మూవీ పోస్టర్లో కాకుండా నయన తార ఫోటోను విడిగా చూస్తే.. అది ఏ మూవీలోదో చెప్పడం కష్టం.

తెలుగులో అప్పుడెప్పుడో వచ్చిన అనామికలో ఎలా కనిపిస్తోందో, ఇప్పుడు ముమ్మట్టి మూవీలో అలాగే ఉంది నయన్. మరి ఇంతగా ఒకే గెటప్ తో నెట్టుకురావడంలో మాత్రం వీళ్ల ట్యాలెంట్ ని పొగడాల్సిందే. దీనికి తోడు ఈమె ఖాతాలో కోలీవుడ్ లో మూడు బ్లాక్ బస్టర్స్ పడ్డంతో, ఇక ఛేంజ్ అడిగే ధైర్యం కూడా ఎరు చేయరు. రామ్ ని అయితే.. మార్పు చూపించమన్నా పెద్దగా యూజ్ ఉండదు కూడా. కొత్తదనం చూపిస్తాం అనడమే తప్ప.. ఆ కొత్త అనేది తమ దగ్గరే స్టార్ట్ అవాలని వీరు ఎందుకు అనుకోరో?
Tags:    

Similar News