గ్లామరసంతో చంపేస్తున్న నయన్

Update: 2016-07-26 05:24 GMT
నయనతార ఇప్పుడు సౌత్ లో టాప్ మోస్ట్ హీరోయిన్. అటు పెర్ఫామెన్స్ లోను.. ఇటు డిమాండ్ లోను అమ్మడి రేంజ్ టాప్ లోనే ఉంది. సాధారణంగా ఈ రేంజ్ కి చేరిన హీరోయిన్లు గ్లామర్ ఒలకబోయమంటే.. అబ్బే అంటుంటారు. కానీ నయనతార మాత్రం ఈ విషయంలో సంథింగ్ డిఫరెంట్.

ప్రస్తుతం తమిళ్ సినిమాలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టిన నయన్.. తెలుగులో అడపాదడపా మాత్రమే కనిపిస్తోంది. ఇప్పుడు విక్టరీ వెంకటేష్ తో కలిసి  బాబు బంగారం మూవీలో నటించింది నయన్. చివర్లో ఏదో డేట్స్ సమస్యతో ఓ పాట పిక్చరైజ్ చేయలేదని అన్నారు కానీ.. తీసినంత వరకూ అయితే నయన్ ఫుల్లుగా అందాలు ఒలకబోసేసింది. దర్శకుడు మారుతి కూడా పాటల్లో నయనతార పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. స్లీవ్ లెస్ బ్యాక్ ఓపెన్ జాకెట్ తో కుర్రాళ్లకి పిచ్చెక్కించాలని బాగానే డిసైడైనట్లుంది నయన్.

ఇంత అందంగా గ్లామర్ గా నయన్ ని చూశాక.. ఓ పాట షూటింగ్ తీయడం లేదని తెలిస్తే కచ్చితంగా బాధ పడాల్సిందే. అయ్యో ఓ రొమాంటింక్ సాంగ్ మిస్ అయ్యామే అని ఫీలయిపోతున్నారు చాలామంది.
Tags:    

Similar News