మెగాస్టార్‌- కొరటాల మూవీలో నయన

Update: 2019-01-18 06:39 GMT
సైరా సినిమాలో ప్రస్తుతం మెగాస్టార్‌ పుల్‌ బిజీగా ఉన్నాడు. మొన్న సంక్రాంతికి కూడా ఎలాంటి రెస్ట్ తీసుకోకుండా సైరా షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఆగస్ట్‌ నాటికి రిలీజ్‌ చేయాలంటే… ఏప్రిల్‌ నాటికి మూవీని కంప్లీట్‌ చెయ్యాలి. అందుకే రాత్రింబవళ్లు కష్టపడుతున్నాడు. ఇందులో మెగాస్టార్‌ సరసన నయనతార హీరోయిన్‌ గా నటిస్తుంది.

సైరా మూవీ తర్వాత.. కొరటాల శివ సినిమా స్టార్ట్‌ చేస్తాడు మెగాస్టార్‌. ఈ సినిమాకు సంబంధించి కథ, కథనాలు పూర్తయ్యాయి కానీ హీరోయిన్‌ మాత్రం ఫైనల్‌ అవ్వలేదు. ముందుగా కాజల్‌ అగర్వాల్‌ ని అనుకున్నారు కానీ.. కాజల్ ఆల్‌ రెడీ ఖైదీ నెంబర్‌ 150లోనటించింది. ఆ తర్వాతి ఆప్షన్‌ శృతిహాసన్‌. కమల్‌ హాసన్‌ - చిరంజీవి ఇద్దరూ సమకాలీనులు. కమల్‌ కూతురు పక్కన స్టెప్పులేస్తే తన పెద్దరికానికి అర్థం ఉండదని మెగాస్టార్‌ భావన. అందుకే.. ఆల్‌ రెడీ సైరాలో నటిస్తున్న నయనతారకే అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారట. ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయని - ఇంకా ఫైనల్‌ కాలేదని కొణిదెల ప్రొడక్షన్స్‌ చెప్తోంది. మరి కొరటాల నయనతారే ఫిక్స్‌ అవుతారా లేదా కాజల్‌కే కమిట్‌ అవుతారా.. వెయిట్‌ అండ్‌ సీ.


Full View

Tags:    

Similar News