• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  స్టార్‌ డైరెక్టర్‌ కు...

స్టార్‌ డైరెక్టర్‌ కు వార్నింగ్‌ నయన్‌ క్రేజ్‌ నిదర్శణం

By - Tupaki Desk
Update: 2019-11-06 08:08 GMT
ప్రస్తుతం కోలీవుడ్‌ లోనే కాకుండా సౌత్‌ సినీ ఇండస్ట్రీలోనే నయనతార స్టార్‌ హీరోయిన్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అత్యధిక పారితోషికం తీసుకునే ముద్దుగుమ్మల్లో మొదటి వరుసలో ఉండటంతో పాటు అత్యధిక సినిమాల్లో ఈ అమ్మడు నటిస్తోంది. లేడీ సూపర్‌ స్టార్‌ అంటూ కూడా ఈమెకు అభిమానులు బిరుదు ఇచ్చేశారు. అంతటి స్టార్‌ డం ఉన్న నయన్‌ ప్రస్తుతం సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ తో 'దర్బార్‌' చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే.

దర్బార్‌ చిత్రాన్ని ప్రముఖ స్టార్‌ డైరెక్టర్‌ మురుగదాస్‌ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంను అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఈ చిత్ర దర్శకుడు మురుగదాస్‌ తో గతంలో నయనతార విభేదించింది. గజిని చిత్రంలో ముఖ్య పాత్రకు అంటూ తీసుకున్నారు. కథ చెప్పిన సమయంలో చాలా చెప్పారు. కాని తీరా సినిమాలో మాత్రం తన పాత్రను చాలా తగ్గించడంతో పాటు అసలు ప్రాముఖ్యత లేకుండా తీశారంటూ అప్పట్లో నయనతార కామెంట్స్‌ చేసింది.

గజిని విషయంలో జరిగినట్లుగా మళ్లీ జరగదని హామీ ఇచ్చిన తర్వాతే దర్బార్‌ చిత్రంలో నటించేందుకు నయనతార ఓకే చెప్పింది అంటూ తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కథలో చెప్పిన విధంగానే తన సీన్స్‌ ఉండాలని.. ఫైనల్‌ ఎడిట్‌ లో కూడా తన సీన్స్‌ ను మొదట చెప్పినట్లుగా ఉండాలనే కండీషన్‌ తో నయనతార ఈ చిత్రంలో నటించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఒక వేళ మళ్లీ ఏమైనా తేడా జరిగితే సినిమా విడుదలనే అడ్డుకుంటానంటూ సున్నితంగా మురుగదాస్‌ కు నయన్‌ వార్నింగ్‌ కూడా ఇచ్చిందని తమిళ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

తమిళంలోనే కాకుండా ఇండియా వ్యాప్తంగా కూడా స్టార్‌ స్టేటస్‌ ను కలిగి ఉన్న దర్శకుడు మురుగ దాస్‌ కే సున్నితంగా నయన్‌ వార్నింగ్‌ ఇచ్చిందంటే ప్రస్తుతం ఆమె క్రేజ్‌ ఏ రేంజ్‌ లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అంటూ నయన్‌ అభిమానులు సోషల్‌ మీడియాలో చర్చించుకుంటున్నారు.
Tags:    
  • Nayanathara 
  • Ar Murugadoss 
  • Darbar 
  • Kollywood 
  • Chennai 
  • Bigil 
  • Whistle 
  • Tupaki News 

Similar News

100 అడుగుల క్రేన్ ప్రమాదం నుంచి కాపాడిన అదృశ్య హస్తం!

2026-11-13 12:30 GMT

సృజనాత్మక స్వేచ్ఛకు సంకెళ్లు!

2026-11-13 11:36 GMT

రాజమౌళి ఆలోచన సరైనదేనా?

2026-11-13 11:30 GMT

సాయిపల్లవి పాదాలకు నమస్కరించిన కోచ్!

2026-11-13 10:28 GMT

'సెల్ఫ్ రెస్పెక్ట్ ' పద్ధతిలో కావ్య- అనిరుధ్ పెళ్లి.. ఈ పద్ధతి ఎప్పుడు? ఎక్కడ? ఎలా ఆవిర్భవించిందంటే?

2026-11-13 10:27 GMT

రామాయణంలో అతనికి మాత్రమే భారీ ప్రశంసలు!

2026-11-13 10:26 GMT

పిల్లల కోసం టికెట్ రేట్లు తగ్గించారు

2026-11-13 10:24 GMT

అక్క‌డాయ‌న అందుకే మెగాస్టార్ అయ్యారు!

2026-11-13 10:19 GMT

ట్రైల‌ర్ టాక్: 'తుంబాడ్' స్టైల్ మేకింగ్ ఆర్ట్‌వ‌ర్క్‌తో ద‌డ పుట్టిస్తోంది!

2026-11-13 10:18 GMT

కీరవాణి అంకితభావంపై అనుపమ్ ఖేర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్!

2026-11-13 08:34 GMT

నాగశౌర్యతో విభేదాలపై స్పందించిన వెంకీ కుడుముల..!

2026-11-13 08:33 GMT

'జంగా' గ్లింప్స్: నోట్లో మందు బాటిల్.. శ్మశానంలో చితి మంటలు

2026-11-13 08:31 GMT

Copyright @2026

Powered by Blink CMS