#నయన్ మూవీ.. సామ్ పై మళ్లీ అదే ప్రచారం
అక్కినేని కోడలు సమంత ఇటీవల ఓటీటీ కంటెంట్ పైనే దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ సీజన్ లో సినిమాల షూటింగులేవీ లేకపోవడంతో తీరిగ్గా ఉంది. అయితే తమిళంలో నయనతార ప్రధాన పాత్రలో విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `కాతువాక్కుల రేండు కదల్`లో నటించాల్సి ఉంది.
అయితే ఈ మూవీ నుంచి సమంత తప్పుకుందని ఇంతకుముందు కథనాలు వచ్చాయి. గర్భధారణ వల్లనే ఇలా చేస్తోందని గుసగుసలు వినిపించాయి. కానీ అది నిజం కాలేదు. ఇటీవలే నయన్ బర్త్ డే సందర్భంగా సామ్ శుభాకాంక్షల ట్వీట్ తో అలాంటిదేమీ లేదని అంతా భావించారు. నయన్ తో కానీ విఘ్నేష్ తో కానీ నెటిజనుల్లో సాగుతున్న ప్రచారం ప్రకారం ఎలాంటి వివాదాలు లేవని అర్థమైంది.
అయితే మరోసారి అదే రూమర్ తాజాగా రిపీటవుతోంది. నయన్ రోల్ తో పోలిస్తే తన పాత్రకు విఘ్నేష్ అంతగా ప్రాధాన్యతనివ్వలేదని అందుకు అలిగిన సామ్ ఆ సినిమా నుంచి తప్పుకుందని ప్రచారమవుతోంది. దీనిపై విఘ్నేష్ తో ఘర్షణ పడిందని దీంతో సామ్ ని త్రిష లేదా కీర్తి సురేష్ తో రీప్లేస్ చేయాలని భావిస్తున్నారని తాజాగా ప్రచారమవుతోంది. నిజానికి నయన్ ఎప్పటికీ ఇలానే అద్భుతంగా ప్రకాశించాలని బర్త్ డే వేళ విషెస్ తెలిపిన సమంత ఇలా వెంటనే రూటు మారుస్తుందా? అన్నది సందేహం గా మారింది. అయితే ఏది నిజం ఏది అబద్ధం? అన్నది చిత్రబృందం చెప్పాల్సి ఉంటుంది.