• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నయనతార రేంజ్ .. ఆమెకున్న...

నయనతార రేంజ్ .. ఆమెకున్న క్రేజ్ అలాంటిది మరి!

By - Tupaki Desk
Update: 2021-11-18 07:00 GMT
తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో నయనతార అంటే తెలియనివారు లేరు. గ్లామర్ పరంగా .. నటన పరంగా ఆమెకి వంకబెట్టేవారే లేరు. నయనతార కూడా సినిమా ఫీల్డ్ కి మోడలింగ్ నుంచే వచ్చింది. అయితే సినిమాల పట్ల ఆమెకి పెద్దగా ఆసక్తి ఉండేది కాదు.

మలయాళ దర్శకుడు సత్యన్ అంతిక్కడ్ పట్టుబట్టడంతో, ఒక సినిమాలో చేసి చూద్దామని చెప్పేసి, 'మనస్సినక్కరే' అనే సినిమా చేసింది. ఆ తరువాత నుంచి కెరియర్ పరంగా ఆమె వెనుదిరిగి చూసుకునే అవసరం లేకుండా పోయింది. ఆ మలయాళ మూవీ తరువాత చాలా తక్కువ గ్యాపులోనే ఆమె తెలుగు .. తమిళ భాషలకి పరిచయమైంది.

తమిళంలో 'అయ్యా' అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నయన్, తెలుగులో 'లక్ష్మీ' సినిమాతో అడుగుపెట్టింది. అయితే అంతకుముందే వచ్చిన 'చంద్రముఖి' సినిమాతో ఆమె తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకుంది. 'ఈ భారీ అందాల భామ ఎవరబ్బా' అని అప్పుడే అంతా అనుకున్నారు.

వెన్నెల్లో తేలుతున్న వెన్నముద్దలా ఉందే అనుకుని మనసులు పారేసుకున్నారు. తెలుగులో స్టార్ హీరోయిన్ అనిపించుకోవడానికి నయన్ కి ఎక్కువ సమయం పట్టలేదు. చిరంజీవి .. బాలకృష్ణ .. వెంకటేశ్ .. నాగార్జున .. రవితేజలతో ఆమె సినిమాలు చేస్తూ వెళ్లింది.

తెలుగులోని సీనియర్ స్టార్ హీరోలందరితోను ఆమె నటించినప్పటికీ, బాలకృష్ణ జోడీగానే ఆమె బాగుందని చెప్పుకున్నారు. ఇక తమిళంలోను ఆమె సీనియర్ స్టార్ హీరోల సరసన వరుస సినిమాలు చేస్తూ వెళ్లింది. సౌత్ లో అత్యధిక పారితోషికం అందుకున్న కథానాయిక అనిపించుకుంది.

స్టార్ హీరోయిన్ అయిన ఆమె వర్ధమాన హీరోల జోడీగా చేయడానికి కూడా వెనుకాడకపోవడం అందరినీ ఆశ్చర్య పరిచింది. ఆమె ఎప్పుడు పారితోషికం పెంచినా .. వచ్చిన అవకాశం వెనక్కి వెళ్లలేదు. నయనతార ఓకే అంటే చాలు అన్నట్టుగానే నిర్మాతలు కాచుకుని ఉండేవారు .. ఇప్పటికీ అదే పరిస్థితి.

ఆరంభంలో అందాలు ఆరబోయడానికి పెద్దగా అభ్యంతరపెట్టని నయనతార, ఆ తరువాత తరువాత గ్లామరస్ పాత్రలకి కాస్త దూరం జరుగుతూ వెళ్లింది. నటన ప్రధానమైన పాత్రలకు ప్రాధాన్యతనిచ్చింది. హీరో సరసన అలాంటి పాత్రలు అరుదుగా తప్ప రావు. అందుకే ఆమె లేడీ ఓరియెంటెడ్ కథలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇక అక్కడి నుంచి ఆమె కెరియర్ మరింత స్పీడ్ అందుకుంది. సస్పెన్స్ థ్రిల్లర్లు .. హారర్ థ్రిల్లర్ల జోనర్లలో ఆమె చేసిన నాయిక ప్రధానమైన సినిమాలు వరుసగా భారీవిజయలను నమోదు చేస్తూ వచ్చాయి. స్టార్ హీరోల సినిమాలతో సమానమైన వసూళ్లను రాబట్టాయి. ఇప్పుడు కూడా సీనియర్ స్టార్ హీరోలు ఆమె డేట్స్ కోసం వెయిట్ చేయవలసిందే.

సినిమాల పరంగా వస్తున్న ప్రశంసలనుగానీ .. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విమర్శలను గాని పట్టించుకోకపోవడం నయనతార ప్రత్యేకత. ఎవరు ఏమైనా చెప్పుకోని తాను చేయవలసిన పనిని చేసుకుంటూ వెళుతూ ఉంటుంది. ప్రస్తుతం ఆమె విఘ్నేశ్ శివన్ తో సహజీవనం చేస్తోంది.

ఈ జంట ఎప్పుడు పెళ్లి మంటపానికి వెళుతుందా అని అభిమానులంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. సినిమా సినిమాకి నయన్ క్రేజ్ పెరుగుతూనే ఉంది .. దాని వెనుక ఆమె పారితోషికం పరుగెడుతూనే ఉంది. ఈ రోజున నయనతార పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేద్దాం.
Tags:    
  • Nayanatara 
  • ActressTollywood 
  • Bollywood 
  • Kollywood 
  • Mollywood 
  • news 
  • movie gossips 

Similar News

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

Copyright @2026

Powered by Blink CMS