30 కోట్ల భరణం నిజం కాదన్న స్టార్ భార్య

Update: 2020-05-30 07:30 GMT
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖి రెండవ భార్య అలియా సిద్దిఖి విడాకులు తీసుకోబోతున్నట్లుగా ప్రకటించిన విషయం తెలిసిందే. తనను నవాజుద్దీన్ కుటుంబ సభ్యులు తీవ్రంగా వేదించారు అంటూ అలియా మీడియా తో మాట్లాడిన సందర్భంగా పేర్కొంది. ఇప్పటికే తన లాయర్ నవాజుద్దీన్ కు మెయిల్ మరియు వాట్సాప్ ద్వారా విడాకులకు సంబందించిన పత్రాలు పంపించడం జరిగిందని పేర్కొంది.

ఇదే సమయంలో అలియా తన భర్త నవాజుద్దీన్ నుండి 30 కోట్ల భరణం మరియు ఒక అపార్ట్ మెంట్ లోని ప్లాట్ ను భరణం గా డిమాండ్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అందుకు సంబంధించిన కొన్ని పత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీడియాలో వైరల్ అవుతున్న ఆ వార్తలపై అలియా సీరియస్ అయ్యింది. తాను భరణం డిమాండ్ చేసినట్లుగా వస్తున్న వార్తలు నిజం కాదని పేర్కొంది.

తన పేరుతో నకిలీ నోటీసు ప్రచారం జరుగుతోంది. అతి త్వరలోనే దీని వెనుక ఉన్నది ఎవరు అనే విషయాన్ని బయట పెడుతామంటూ పేర్కొంది. పెళ్లి అయిన సంవత్సరానికి తన పట్ల అమానుషంగా ప్రవర్తించారని, అందుకే తాను విడాకులు కోరుతున్నాను అంటూ అలియా పేర్కొంది. ఆలియా ఆరోపణలపై ఇప్పటి వరకు నవాజుద్దీన్ సిద్దిఖి స్పందించలేదు.
Tags:    

Similar News