• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  షాహిద్ అదరగొట్టేశాడంటున్న...

షాహిద్ అదరగొట్టేశాడంటున్న నాని!

By - Tupaki Desk
Update: 2022-04-22 10:39 GMT
నాని కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల జాబితాలో 'జెర్సీ' ముందువరుసలో కనిపిస్తుంది. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించాడు.

క్రికెట్ నేపథ్యంలో నడిచే కథ ఇది. ఒక వైపున ఆట .. మరో వైపున ఆశయం .. ఈ రెండింటితో ముడిపడిన జీవితాన్ని గురించి ఈ సినిమా చెబుతుంది.  2019 .. ఏప్రిల్ 19న వచ్చిన  ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. బలమైన కథాకథనాలు .. పాత్రలను తీర్చిదిద్దిన తీరు ఈ సినిమా విజయంలో కీలకమైన  పాత్రను పోషించాయి.

తెలుగులో ఈ సినిమాకి మంచి రివ్యూస్ వచ్చాయి. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఇదే కథను హిందీలో రాసుకుని .. షాహిద్ కపూర్ హీరోగా రూపొందించాడు. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించిన ఈ సినిమాను, దిల్ రాజు .. సూర్యదేవర నాగవంశీ ..  అల్లు ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ వారు నిర్మించారు. సరైన విడుదల సమయం కోసం ఎదురుచూస్తూ వచ్చిన ఈ సినిమా టీమ్, ఈ రోజున ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. తొలి ఆటతోనే ఈ సినిమా అక్కడ హిట్ టాక్ తెచ్చుకుంది.  

ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి నాని స్పందించాడు. హిందీ 'జెర్సీ' చూశాను .. చాలా బాగుంది. షాహిద్ కపూర్ తన పాత్రకి న్యాయం చేశారు. మృణాల్ ఠాకూర్ .. పంకజ్ కపూర్ .. రోనిత్ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటోంది.

గౌతమ్ తిన్ననూరి  హిందీలోను హిట్ కొట్టాడు. ఈ సినిమా సక్సెస్ కి కారణమైన ప్రతి ఒక్కరికీ కంగ్రాట్స్ " అంటూ ఆయన సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలియజేశాడు. తెలుగు వెర్షన్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించిన అనిరుధ్, హిందీ వెర్షన్ కి కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్  ను అందించడం విశేషం.

 ఇక ప్రపంచవ్యాప్తంగా 'జెర్సీ' సినిమాకి సంబంధించి వస్తున్న టాక్ పట్ల షాహిద్ కపూర్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఈ క్రెడిట్ అంతా కూడా గౌతమ్ తిన్ననూరికి చెందుతుందని చెప్పాడు. ఇక ఈ సినిమా తరువాత చరణ్ తో గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్టు ఉండనుంది.

అందుకు సంబంధించిన సన్నాహాలను కూడా ఆయన నడిపిస్తూనే వస్తున్నాడు. ఇది స్పోర్ట్స్ నేపథ్యంలో నడిచే కథ కాదనీ, యాక్షన్ .. ఎమోషన్ ను కలుపుకుంటూ సాగే కథ అని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
Tags:    
  • Tollywood 
  • naturalstar 
  • nani 
  • comments 
  • shahid 
  • socialmedia 
  • tupakinews 
  • telugunews 
  • latestmews 

Similar News

వారణాసి.. దిల్ రాజుకు పోటీగా బిగ్ డీల్?

2026-11-11 04:56 GMT

కజిన్‌పై ప్రేమను చాటుకున్న హృతిక్ రోషన్.. స్పెషల్ విషెస్!

2026-11-11 04:27 GMT

300 కోట్ల క్ల‌బ్‌లో టాప్ -5 హిందీ హీరోలు

2026-11-11 04:27 GMT

ఈ హీరోనే ఇప్పుడు బాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియ‌న్ సూప‌ర్‌స్టార్?

2026-11-11 03:58 GMT

Bigg Boss Telugu 10: ఫ్యామిలీ వీక్ ఎమోషనల్ ఎంట్రీలు!

2026-11-11 03:57 GMT

తెలుగు మార్కెట్‌పైనే పొరుగు హీరోల ఫోక‌స్ ఎందుకు?

2026-11-11 03:57 GMT

ఈ ఏడాది తమిళ్ సినిమాల సక్సెస్ కి, కొన్ని తెలుగు సినిమాల ప్లాప్ కి కారణం ఏంటి?

2026-11-11 03:56 GMT

ఇట్లు అర్జు USA థియేటర్స్ లిస్ట్

2026-11-11 03:28 GMT

'వార‌ణాసి' త‌ర్వాత ప్రియాంక చోప్రా టాలీవుడ్‌కి బైబై

2026-11-11 01:46 GMT

బాలకృష్ణ అంటే భయపడ్డా.. ఆయన మంచితనం చూసి షాకయ్యా: సీనియర్ హీరోయిన్ సంఘవి

2026-11-11 01:45 GMT

రాజమౌళిని తిడతారా.. వారణాసిని ఆపుతారా?: ప్రకాష్ రాజ్ కామెంట్స్

2026-11-11 01:45 GMT

మాయ లేడీ సెన్సార్.. క్రేజీ క్రేజీగా హీరో గారి వేషాలు

2026-11-11 01:42 GMT

Copyright @2026

Powered by Blink CMS