వావ్.. ఆయన కూడా హాలీవుడ్ వెళ్తున్నాడు

Update: 2016-02-09 15:30 GMT
ఒకప్పుడు మన ఇండియన్ యాక్టర్ కు ఏదైనా హాలీవుడ్ సినిమాలో చిన్న పాత్ర దక్కితే ఔరా అనుకునేవాళ్లం. దాని గురించి కథలు కథలుగా చెప్పుకునేవాళ్లం. కానీ ఇప్పుడది చాలా చిన్న విషయం అయిపోయింది. బాలీవుడ్లో ఇర్ఫాన్ ఖాన్ లాంటి వాళ్లు తరచుగా హాలీవుడ్ సినిమాలు చేసేస్తున్నారు. అది కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. దక్షిణాది నటులు సైతం హాలీవుడ్ సినిమాల్లో ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఇటీవలే ధనుష్ అయితే ఏకంగా హీరో వేషంతో హాలీవుడ్ లో అడుగుపెట్టేస్తున్నాడు. అతను ప్రధాన పాత్రలు ‘ది ఫాకిర్’ అనే సినిమా తెరకెక్కుతోంది.

మరోవైపు తమిళ - తెలుగు భాషల్లో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న సీనియర్ యాక్టర్ నాజర్ సైతం ఓ హాలీవుడ్ సినిమా చేయబోతుండటం విశేషం. గతంలో ఆయన ‘ఫెయిర్ గేమ్’ అనే హాలీవుడ్ చిత్రంలో నటించారు. ఐతే అందులో ఆయన చేసింది చిన్న పాత్రే. నాజర్ తాజాగా ‘సోలార్ ఎక్లిప్స్’ అనే  టైటిల్‌ తో తెరకెక్కనున్న సినిమాలో ఓ కీలక పాత్ర పోషించబోతున్నాడు. ఇది భారత స్వాతంత్య్ర పోరాట కాలం నేపథ్యంలో సాగే సినిమా అట. నాజర్ అశోక్ అనే పోలీసాఫీసర్‌ పాత్రలో కనిపించోతున్నారట. తనకు దక్కిన హాలీవుడ్ అవకాశం గురించి చాలా సంతోషంగా మీడియాతో వెల్లడించారు నాజర్.
Tags:    

Similar News