సైడ్ డ్యాన్సర్ తరహాలో ఉంది

Update: 2017-06-27 11:09 GMT
అమెరికన్ మోడల్ నర్గీస్ ఫక్రీకి ఇండియాలో కూడా ఫుల్లు డిమాండ్ ఉంది. వరుసగా సినిమాలు చేస్తూ.. క్రేజీ ప్రాజెక్టులను పట్టేస్తూ బాగానే క్రేజ్ సంపాదించేసుకుంది. అయితే.. ఈ భామ రీసెంట్ గా ఓ సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇచ్చింది. తనకు చిన్ననాటి కోరిక ఒకటి తీరిపోతోందని.. సింగర్ గా మారాలనే కోరిక తీరుతోందని చెప్పింది.

పంజాబీ సింగర్ పరిచయ్.. కెనడియన్ ర్యాపర్ కార్డినాల్ తో కలిసి ఓ పాట పాడేశాననని చెప్పిన నర్గీస్.. తన సింగింగ్ డెబ్యూ అంటూ హడావుడి చేసింది. ఇప్పుడా పాట ఆన్ లైన్ లోకి వచ్చేసింది. తీరా పాట చూసిన నర్గీస్ అభిమానులకు షాక్ కొట్టేయక మానదు. పాట బాగానే ఉంది కానీ.. అందులో సింగర్ కం యాక్ట్రెస్ అయిన నర్గీస్ ఎక్కడా అని వెతుక్కోవాల్సిన పరిస్థితి. పాటలో ఈమె కనిపించిన తీరు చూస్తే జూనియర్ ఆర్టిస్ట్ మాదిరిగానో.. సైడ్ డ్యాన్సర్ తరహాలో ఉంది.

వాయిస్ వినిపించిన దాఖలాలు కూడా అక్కడక్కడ మాత్రమే. అదేదో కోరస్ కోసం అన్నట్లుగా తప్ప.. అమ్మడి వాయిస్ ను ఎలివేట్ చేసే తరహాలో ఏమీ లేదు. ఈ పాటతో తాను సింగర్ మారిపోయినట్లు నర్గీస్ చెప్పుకోవడం కంటే.. ఏదో జస్ట్ ఓ ప్రయత్నం చేశానని చెప్పుంటే.. కాసింత హుందాగా అయినా ఉండేదేమో. ఈ సారికి సింగర్ గా నర్గీస్ ట్రయల్ కు క్రేజ్ సున్నా అనేయచ్చు.

Full View

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News