స‌గ‌మొచ్చినా తుంట‌రి బంప‌ర్ హిట్టే

Update: 2016-03-09 09:30 GMT
తుంట‌రి టీమ్ చాలా కాన్ఫిడెంట్‌ గా ఉంది. డ‌బ్బులొచ్చే సినిమా చేయాల‌నుకొన్నాను, చేసేశాన‌ని ద‌ర్శ‌కుడు కుమార్ నాగేంద్ర అంటున్నాడు. కామెడీ అదిరిపోయేలా పండిన సినిమా ఇదని నారా రోహిత్ అంటున్నాడు. ఏ టీమ్ అయినా  సినిమా విడుద‌ల‌కి ముందు ఇలాగే చెబుతుంది, ఇందులో వింతేముంది అంటారా?  నిజ‌మే కానీ...  ఈ క‌థపై న‌మ్మ‌కంతో ఇండ‌స్ట్రీ కూడా కొన్ని ఆశ‌లు పెట్టుకొంది. ప్రేక్ష‌కులు కూడా చూద్దాం అన్న‌ట్టుగా ఉన్నారు. మ‌రి రిజ‌ల్టే ఎలా ఉంటుంద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా ఉంది.  అటు ద‌ర్శ‌కుడికీ, ఇటు కథానాయ‌కుడికీ... ఇద్ద‌రికీ కూడా చాలా కీలక‌మైన సినిమా ఇది.

కుమార్ నాగేంద్ర తొలి సినిమాతోనే మంచి ద‌ర్శ‌కుడు అనిపించుకొన్నాడు. వ‌రుస‌గా రెండు ప‌రాజ‌యాల త‌ర్వాత  ఆయ‌న తీసిన సినిమా కాబ‌ట్టి జాగ్ర‌త్త‌గానే తీసుంటాడ‌నే న‌మ్మ‌కాలు ఉన్నాయి.   దానికితోడు  త‌మిళంలో ఘ‌న‌విజ‌యం సాధించిన మాన్ క‌రాటేకి రీమేక్‌ గా ఈ చిత్రం తెర‌కెక్కింది. అక్క‌డ 55కోట్లు వ‌సూలు చేసింది. అందుకే ఈ  సినిమాపై అంద‌రికీ మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. నారా రోహిత్ కూడా ఎప్పుడూ మంచి క‌థ‌ల్నే ఎంచుకొంటుంటాడు. ఈ సినిమాలో కామెడీ బాగా పండించాన‌ని, ఆ ర‌కంగా నాకు ఇది కీల‌క‌మైన సినిమా  అని ఆయ‌న అంటున్నాడు. త‌మిళంలో 55కోట్లు వ‌సూళ్లు సాధించిన ఈ సినిమా ఇక్క‌డ క‌నీసం 25 కోట్లు సాధించినా ఘ‌న విజ‌యం సాధించిన‌ట్టే లెక్క‌. త‌క్కువ బ‌డ్జెట్టులోనే సినిమాని పూర్తి చేశారు. 25 కోట్లు కాక‌పోయినా క‌నీసం 20కోట్లు వ‌చ్చినా సినిమా నిర్మాల‌త‌కి లాభాలొస్తాయి. మ‌రి రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.
Tags:    

Similar News