• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నారా రోహిత్ సెంటిమెంటు...

నారా రోహిత్ సెంటిమెంటు జోడించాడుగా..

By - Tupaki Desk
Update: 2016-09-29 07:50 GMT
నటుడిగా తొలి సినిమాతోనే మంచి పేరు సంపాదించాడు నారా రోహిత్. ఆ తర్వాత కూడా అతడి నట ప్రతిభకు రుజువుగా నిలిచే సినిమాలు చాలానే వచ్చాయి. రోహిత్ చేసిన వాటిలో అతడికి పోలీస్ క్యారెక్టర్లు భలేగా కుదిరాయి. మామూలుగా ఓ హీరో కొంత అనుభవం వచ్చాక.. తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్నాకే పోలీస్ క్యారెక్టర్ చేస్తాడు. కానీ రోహిత్ మాత్రం తొలి సినిమా ‘బాణం’లోనే ఐపీఎస్ ఆఫీసర్ గా కనిపించి మెప్పించాడు. ఆ తర్వాత రౌడీ ఫెలో.. అసుర లాంటి సినిమాల్లో పోలీస్ పాత్రల్లో అదరగొట్టాడు. అతను ఖాకీ వేసిన ప్రతిసారీ మంచి పేరొచ్చింది. సక్సెస్ కూడా వరించింది.

ఈ నేపథ్యంలోనే రోహిత్ తన కొత్త సినిమాకు ఖాకీ సెంటిమెంటును జోడిస్తున్నట్లు తెలిసింది. రోహిత్ కొత్త సినిమా ‘అప్పట్లో ఒకడుండేవాడు’లో రోహిత్ పోలీస్ గానూ కనిపిస్తాడని సమాచారం. ఇందులో రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్నాడు రోహిత్. అతడు ఇందులో నూరుద్దీన్ మహ్మద్ ఇంతియాజ్ అలీ అనే ముస్లిం క్యారెక్టర్ చేస్తుండటం విశేషం. ఈ పాత్రలో అతను పోలీస్ గా కనిపిస్తాడట. ఐతే ఆ పాత్రలో మరో యాంగిల్ కూడా ఉంటుందట. పోలీస్ పాత్ర చేసిన ప్రతిసారీ సక్సెస్ పలకరించింది కాబట్టి ఈ సినిమా కూడా తనకు పాజిటివ్ రిజల్ట్ ఇస్తుందని ఆశిస్తున్నాడు రోహిత్. ఇటీవలే ‘జ్యో అచ్యుతానంద’తో చాన్నాళ్ల తర్వాత ఓ హిట్టు ఖాతాలో వేసుకున్న రోహిత్.. ‘అప్పట్లో ఒకడుండేవాడు’తో సక్సెస్ స్ట్రీక్ కంటిన్యూ చేస్తానని ఆశిస్తున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Nara Rohit 
  • Appatlo Okadundevadu Movie 
  • Telugu NEWs 

Similar News

అహంకారమనే ముద్రకు ధనుష్ వినూత్న కౌంటర్!

2026-11-15 09:46 GMT

అర్థరాత్రి పూట భార్య‌కి వార్నింగ్ లు!

2026-11-15 09:45 GMT

రామాయ‌ణ‌: 10రోజుల్లో 1200 కోట్లు.. 2000 కోట్ల క్ల‌బ్ ఇంకెంత దూరం?

2026-11-15 09:42 GMT

పని పోతుందనే భయంతో వేధింపులు సైతం భరించాను!

2026-11-15 09:38 GMT

25 ఏళ్లయినా ఇంకా జీవితాన్ని అర్ధం చేసుకుంటూనే ఉన్నా!

2026-11-15 07:32 GMT

త్రివిక్రమ్ గారు మీరు అలాంటి సినిమాలే తీయండి సార్...

2026-11-15 07:32 GMT

లగ్జరీ కంటే ప్రశాంతతే ముఖ్యం..ఎందుకో చెప్పిన సీత‌మ్మ‌

2026-11-15 06:52 GMT

బాలయ్యకు డిసెంబర్ సెంటిమెంట్.. ట్రాక్ రికార్డ్ ఎలా ఉందంటే..

2026-11-15 06:31 GMT

మెగా హీరో సినిమాలో ఛాన్స్.. బండి సరోజ్ ఎందుకు వద్దన్నారంటే!

2026-11-15 06:19 GMT

నిర్మాత కష్టాలతోనే సినిమా.. పేర్లు కూడా బయటపెడతానంటూ..

2026-11-15 05:28 GMT

భర్తతో ప్రేమ.. ఆ తర్వాత వేరే వాళ్లతో డేటింగ్.. కాజల్ లవ్ స్టోరీ ఇదే..!

2026-11-15 03:34 GMT

జూనియ‌ర్ అతిలోక సుంద‌రి అలా ఫెయిలైంది!

2026-11-15 02:30 GMT

Copyright @2026

Powered by Blink CMS