దోచుకున్న దర్శకుడికి బంపర్‌ ఆఫర్స్‌

Update: 2018-09-26 17:30 GMT
సుధీర్‌ బాబు - నభా నటేష్‌ జంటగా ఆర్‌ ఎస్‌ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కిన ‘నన్ను దోచుకుందువటే’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. సుధీర్‌ బాబు స్వయంగా నిర్మించిన ఈ చిత్రంకు విమర్శకుల ప్రశంసలతో పాటు మంచి వసూళ్లు వచ్చినట్లుగా సమాచారం అందుతుంది. మొదటి సినిమానే అయినా కూడా దర్శకుడు ఆర్‌ ఎస్‌ నాయుడు మంచి స్క్రీన్‌ ప్లేతో ఆకట్టుకునే విధంగా తెరకెక్కించాడు. సక్సెస్‌ ను దక్కించుకున్న ఈ దర్శకుడికి పలువురి నిర్మాతల నుండి ఆఫర్స్‌ వస్తున్నట్లుగా సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది.

‘నన్ను దోచుకుందువటే’ చిత్రం విడుదలైన వెంటనే సుధీర్‌ బాబు మరో సినిమా చేద్దాం అంటూ దర్శకుడు నాయుడుకు అడ్వాన్స్‌ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సక్సెస్‌ ను ఎంజాయ్‌ చేస్తున్న దర్శకుడు మరో నెల రోజుల్లో కొత్త ప్రాజెక్ట్‌ ను మొదలు పెట్టేందుకు సిద్దం అవుతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఈయన తర్వాత సినిమా ఎవరితో ఉంటుందనే విషయంలో క్లారిటీ లేదు. కాని పలువురు నిర్మాతలు మాత్రం ఈయనకు అడ్వాన్స్‌ లు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

తాజాగా ‘నన్ను దోచుకుందువటే’ చిత్రం సక్సెస్‌ దక్కించుకున్న నేపథ్యంలో బీవీఎస్‌ ఎన్‌ ప్రసాద్‌ - సుధాకర్‌ చెరుకూరి మరియు మైత్రి మూవీస్‌ వారు ఇంకా నిఖిల్‌ కూడా ఈయనతో సినిమాను చేసేందుకు అడ్వాన్స్‌ లు ఇచ్చారట. ప్రస్తుతం ‘పడి పడి లేచే మనసు’ చిత్రంను నిర్మిస్తున్న సుధాకర్‌ చెరుకూరి భారీ మొత్తంలో పారితోషికం ఆఫర్‌ చేసి మరీ దర్శకుడు నాయుడితో సినిమాను చేయాలని ఆశపడుతున్నట్లుగా ఫిల్మ్‌ సర్కిల్స్‌ లో టాక్‌ వినిపిస్తుంది.

Tags:    

Similar News