కృష్ణ.. అర్జున్.. పాట.. నాని!!

Update: 2018-01-13 06:21 GMT
వెంకటాద్రి ఎక్స్ ప్రెస్.. ఎక్స్ ప్రెస్ రాజా.. వంటి సినిమాలను రూపొందించిన దర్శకుడు మేర్లపాక గాంధి ఇప్పుడు మరొక సినిమా చేస్తున్నాడు. నేచురల్ స్టార్ నాని హీరోగా మనోడు ''కృష్ణార్జున యుద్దం'' అనే సినిమాను తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాని డబుల్ యాక్షన్ చేస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్ ఒక క్యారక్టర్ తో రొమాన్స్ చేస్తుంటే.. కొత్త పిల్ల రుక్సార్ మీర్ మరో పాత్రతో రొమాన్స్ చేస్తోంది.

విషయం ఏంటంటే.. మొన్ననే డిసెంబర్ చివరి వారంలో ఎంసిఏ సినిమాతో వచ్చాడు నాని. టాక్ ఎలా ఉన్నా కూడా సినిమాకు డబ్బులు గట్టిగా వచ్చేశాయి. దానితో ఇప్పుడు మంచి ఊపు మీద ఉండి.. అసలు నా కృష్ణార్జున యుద్దం ఎప్పుడు రిలీజ్ అవుతున్నా కూడా.. ఈ సినిమాను తీస్తుంది ప్రజల కోసం కాబట్టి.. ఈ సినిమా తాలూకు ఫస్ట్ లుక్ నేను నా టీమ్ మాత్రం చూడటమే కాకుండా.. మీక్కూడా చూపించేస్తా అంటూ ఒక ప్రకటన ఇచ్చాడు నాని. కాస్త ఓవర్ గా అనిపించినా కూడా.. సంక్రాంతి టైములో తన తదుపరి సినిమా ప్రమోషన్లను స్టార్ట్ చేశాడంటే.

అదిగో జనవరి 14న ఉదయం 10 గంటలకు కృష్ణ క్యారెక్టర్ లుక్.. జనవరి 15న అర్జున్ క్యారక్టర్ లుక్..  జనవరి 16న సినిమాలో ఒక పాటను రిలీజ్ చేస్తున్నారట. అంటే సంక్రాంతికి వచ్చిన సినిమాలు పెద్దగా హంగామా చేయట్లేదు కాబట్టి.. తన సినిమా ఫస్ట్ లుక్స్ తో ఏదన్నా మ్యాజిక్ చేద్దాం అని ఫిక్సయ్యావా నాని? కానివ్!!

Full View
Tags:    

Similar News