• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అఖిల్-నాని పోటాపోటీ!!

అఖిల్-నాని పోటాపోటీ!!

By - Tupaki Desk
Update: 2017-07-26 10:26 GMT
నేచురల్ స్టార్ నాని వరస హిట్లతో మాంచి జోష్ మీదున్నాడు. నేను లోకల్ లాంటి మాస్ సినిమా చేసిన తర్వాత ఎవ్వరూ ఊహించని విధంగా నిన్ను కోరి లాంటి డిఫరెంట్ లవ్ స్టోరీ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నాడు. శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ఇమేజ్ తో సంబంధం లేకుండా నాని చేసిన పాత్ర అందరినీ ఆకట్టుకుంది.

నిన్ను కోరి తర్వాత నాని ఎంసీఏ (మిడిల్ క్లాస్ అబ్బాయి) సినిమా చేస్తున్నాడు. సిద్ధార్ధ - శృతి హాసన్ లతో ఓ మై ఫ్రెండ్ సినిమా తీసిన వేణు శ్రీరామ్ ఎంసీఏ సినిమా డైరెక్ట్ చేయబోతున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమా డిసెంబరు 21 నాటికి థియేటర్లకు తీసుకురావాలని ఫిలిం మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే డిసెంబర్ 22నే అఖిల్ హీరోగా విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వస్తున్న సినిమా రిలీజ్ చేయాలని నాగార్జున ప్లాన్ చేస్తున్నాడు. ఒక రోజు తేడాలో రెండు పెద్ద సినిమాలు రిలీజ్ కావడమంటే కచ్చితంగా అది కలెక్షన్లపై ప్రభావం చూపుతుంది. ఎందుకంటే సినిమాకు మొదటి వారం కలెక్షన్లే కీలకం. వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో సినిమా విడుదలైతేనే నిర్మాత - బయ్యర్లు సేఫ్ గా బయటపడే అవకాశం ఉంటుంది. ఇంకా అయిదు నెలలున్నందున ఎవరి నిర్ణయమైనా మారుతుందేమో చూడాలి.

ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులందరినీ తన నటనతో ఫిదా చేసేసిన సాయి పల్లవి ఎంసీఏ లో హీరోయిన్ గా నటిస్తోంది. నాని తన ప్రతి సినిమాలో తన యాక్షన్ కు నూటికి నూరు మార్కులు తెచ్చుకుంటూనే ఉన్నాడు. ఇప్పుడు సాయి పల్లవి లాంటి టాలెంటెడ్ హీరోయిన్ తోడవడంతో ఈ జంట తెరపై మెస్మరైజ్ చేయడం ఖాయం.
Tags:    
  • Nani 
  • MCA Movie 
  • Akhil Second Movie 
  • Telugu NEWs 

Similar News

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Copyright @2026

Powered by Blink CMS