US ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్: గ్యాంగ్ లీడర్ కు ఆరో స్థానం

Update: 2019-09-17 06:15 GMT
టాలీవుడ్ సినిమాలకు యూఎస్ మార్కెట్ చాలా ముఖ్యమైనదని అందరికీ తెలిసిందే.  అయితే గత కొంతకాలంగా యూఎస్ లో తెలుగుసినిమాల హవా తగ్గింది.  హవా తగ్గింది అనడం కంటే సక్సెస్ రేట్ తగ్గింది అని చెప్పడం కరెక్ట్.   దీనికి చాలా కారణాలే ఉన్నాయి. ఎక్కువ రేట్లకు ఓవర్సీస్ హక్కులు అమ్మడం ఒక కారణం. సినిమాపై ముందే బజ్ ఉండడంతో పాటు సినిమాకు మంచి రివ్యూస్.. పాజిటివ్ మౌత్ టాక్ వస్తే తప్ప యూఎస్ ప్రేక్షకులు సినిమాను చూడడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడం కూడా మరో కారణం.

అయినా ఇలాంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ ఏడాది చాలా సినిమాలు యూఎస్ బాక్స్ ఆఫీస్ వద్ద చెప్పుకోదగ్గ కలెక్షన్స్ వసూలు చేశాయి.  గతంలో స్టార్ హీరోల సినిమాలు ఫస్ట్ వీకెండ్ లోనే 1 మిలియన్ మార్కును అవలీలగా దాటేసేవి కానీ ఇప్పుడు కాస్త కష్టంగా ఉంది. ఇక ఈ ఏడాది ఇప్పటివరకూ రిలీజ్ అయిన తెలుగు సినిమాలలో మొదటి వీకెండ్ లో హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన తెలుగు సినిమాల టాప్ 10 లిస్టులో రెండు సినిమాలు మాత్రమే 1 మిలియన్ మార్క్ దాటగలిగాయి.  'సాహో' మాత్రం రెండు మిలియన్ల మార్క్ టచ్ చేసింది.

ఇక ఈ లిస్టులో తాజాగా చేరిన చిత్రం న్యాచురల్ స్టార్ నాని నటించిన 'గ్యాంగ్ లీడర్'. ఈ సినిమా మొదటి వీకెండ్ కలెక్షన్స్ లిస్టులో 6 వ స్థానంలో నిలిచింది. సినిమాకు క్రిటిక్స్ రివ్యూస్ యావరేజ్ గానే ఉన్నప్పటికీ డీసెంట్ మౌత్ టాక్ తో మొదటి వారాంతంలో $700K కు పైగా కలెక్షన్స్ సాధించడం విశేషం.  స్వతహాగా విక్రమ్ కుమార్ సినిమాలకు ఓవర్సీస్ లో ఆదరణ ఎక్కువ.  మరోవైపు నానికి కూడా ఓవర్సీస్ ఆడియన్స్ లో మంచి పట్టు ఉంది.  అందుకే ఈ సినిమా డీసెంట్ కలెక్షన్స్ సాధించింది.. 1 మిలియన్ డాలర్ మార్క్ దిశగా దూసుకుపోతోంది.

US - హయ్యెస్ట్  ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ టాప్ 10 లిస్టు 2019 (ఇప్పటివరకూ)

1. సాహో - $2 మిలియన్

2. మహర్షి - $1.41 మిలియన్

3. జెర్సీ - $931K

4.  F2 - $928K

5. ఎన్టీఆర్ కథానాయకుడు - $863K

6. గ్యాంగ్ లీడర్ - $737K

7. డియర్ కామ్రేడ్ - $687K

8. మజిలీ - $611K

9. ఓ బేబీ - $567K

10. ఎవరు - $335K

    

Tags:    

Similar News