'టక్ జగదీష్' పరిచయ వేడుకలో ఇచ్చిన స్టేట్మెంట్ పై నాని క్లారిటీ..!

Update: 2021-04-01 11:46 GMT
నేచురల్ స్టార్ నాని హీరోగా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం ''టక్‌ జగదీష్‌''. ఇందులో రీతూ వర్మ - ఐశ్వర్య రాజేశ్‌ కథానాయికలు. షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌ పై సాహు గార‌పాటి - హ‌రీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 23న విడుదల కానున్న ఈ సినిమా టీజర్ - సాంగ్స్ అంటూ సందడి చేస్తోంది. ఇప్పటికే రాజమండ్రిలో చేసిన 'పరిచయ వేడుక' సక్సెస్ అవడంతో ఏప్రిల్ 13న వైజాగ్ లో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్.. ఏప్రిల్ 18న హైదరాబాద్ లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్ ను 'టక్ జగదీష్ మంత్'గా మార్చేస్తున్న చిత్ర యూనిట్.. తాజాగా ప్రెస్‌ మీట్‌ ఏర్పాటు చేసి సినిమా విశేషాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ.. ''సినిమా ఫైనల్ కట్ చూసుకున్నాం. చాలా బాగా వచ్చింది. తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుందని శివ నిర్వాణకి చెప్పా. పర్సనల్ గా నాకు చాలా సంతృప్తినిచ్చిన సినిమా ఇది. ఎప్పుడెప్పుడు మీరందరూ థియేటర్‌ కి వచ్చి చూస్తారా అని వెయిట్ చూస్తున్నా. ఇది మన తెలుగు సినిమా. అరుదుగా వచ్చే మన మట్టి వాసన ఉన్న సినిమా ఈ ‘టక్‌ జగదీష్‌’. లడ్డు లా ఉంది సినిమా. చాలా చాలా హ్యాపీగా ఉంది'' అని చెప్పారు.

'పరిచయ వేడుక'లో చేసిన వ్యాఖ్యలపై క్లారిటీ ఇస్తూ.. ''దురదృష్టవశాత్తు మనం మాట్లాడే మాటలు తప్పుగా రీచ్ అవుతుంటాయి. నా ఫ్యాన్స్ ని తగాదాలలో పాల్గొనమని నేను ఎంకరేజ్ చేయనని చెప్పాను. సోషల్ మీడియాలో వేరే వారితో ఫైట్ చేయడం వంటి ఉపయోగంలేని వాటిని ఎంకరేజ్ చేయను. నా ఫ్యాన్స్ ని నేను ఫ్యామిలీలా భావిస్తా.. వారు నా సినిమాలను చూసి ఇంకా ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటాను'' అని నాని అన్నారు. అలానే సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనం చెప్పే మ్యాటర్ క్లియర్ గా ఉన్నప్పటికీ దాని కింద పెట్టే కామెంట్స్-థంబ్ నెయిల్స్-యూట్యూబ్ హెడ్డింగ్స్ మిస్ గైడింగ్ గా ఉంటున్నాయి. దీని వల్ల ఆ ఇంకా మిస్ గైడింగ్ అవుతోంది. ఫ్యాన్స్ అంటే నాకోసం ఏదో చేయాల్సిన వాళ్ళు కాదు.. ఫ్యాన్స్ అంటే వాళ్ళ కోసం మనం ఏదైనా చేయాలని నాని చెప్పుకొచ్చారు.
Tags:    

Similar News