'చిత్రలహరి'కి ఇప్పుడు కనక్ట్ అవుతారా?

Update: 2017-10-20 04:21 GMT

1990లలో పెరిగిన కిడ్స్ అందరికీ బాగా కనక్ట్ అయ్యే ప్రోగ్రాం ఏంటంటే.. ''చిత్రలహరి'' ''చిత్రహార్'' అనే చెప్పాలి. చిత్రలహరి అంటే తెలుగు పాటలను వరుసగా వేసే ఒక కార్యక్రమం. అప్పట్లో వేరే ఛానళ్ళు యుట్యూబులు లేవు కాబట్టి.. ఒక సినిమా పాటను ధియేటర్లో కాకుండా మరో చోట చూడాలంటే.. ఓన్లీ శుక్రవారం వచ్చే చిత్రలహరి కార్యక్రమంలో మాత్రమే చూడాలి.

ఇప్పుడు ఈ వింటేజ్ కార్యక్రమం తాలూకు గానా భజానా ఎందుకంటే.. కిషోర్ తిరుమల డైరక్షన్లో నాని చేస్తున్న సినిమాకు 'చిత్రలహరి' అనే టైటిల్ అనుకుంటున్నారట. తెలుగు పేరే కాబట్టి.. ఎలాగైనా వాడుకోవచ్చు కాని.. కాకపోతే ఆ ప్రోగ్రామ్ పెద్ద హిట్ కాబట్టి ఈ టైటిల్ కూడా సూపర్ హిట్ అనుకుంటే కష్టమే. అసలు 90లలో పుట్టిన వారికి ఇది కనక్ట్ అవ్వదు. ఎందుకంటే వారు ఊహ తెలుసుకునేసరికి జెమిని టివి ఈటివి తెలుగునాట సంచలనాలు సృష్టించేశాయి.

ఇకపోతే వరుస సినిమాలతో నాని భలే ఊరిస్తున్నాడులే. ఆల్రెడీ వేణు శ్రీరామ్ తీసిన ఎంసిఎ రెడీ అవుతుంటే.. మేర్లపాక గాంధి డైరక్షన్ లో కృష్ణార్జున యుద్దం చేస్తున్నాడు. అది కాకుండా శ్రీరాం ఆదిత్య డైరక్షన్ లో నాగ్ తో మల్టీ స్టారర్ చేస్తున్నాడు. ఇప్పుడు కిషోర్ తిరుమలతో సినిమా. వాటే లైనప్ గురూ!!
Tags:    

Similar News