• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నందిని రెడ్డి తర్వాతి...

నందిని రెడ్డి తర్వాతి సినిమా అతడితోనా?

By - Tupaki Desk
Update: 2016-03-06 17:30 GMT
తొలి సినిమాతో మంచి హిట్టు కొట్టి రెండో సినిమాతో బోల్తా కొట్టిన దర్శకులు చాలామంది టాలీవుడ్లో ఉన్నారు. నందిని రెడ్డిని సైతం ఈ ద్వితీయ విఘ్నం సెంటిమెంటును తప్పించుకోలేకపోయింది. ‘జబర్దస్త్’ సినిమా ఫ్లాపవడమే కాక.. ఆమెకు చాలా చెడ్డ పేరు కూడా తెచ్చిపెట్టింది. దీంతో తొలి సినిమా కంటే కూడా మూడో సినిమాకు ముందు చాలా ఒత్తిడి ఎదుర్కొంది నందిని. ఐతే అంత ఒత్తిడిలోనూ మంచి సినిమానే తీసింది. ‘కళ్యాణ వైభోగమే’లో నందిని ముద్ర స్పష్టంగా కనిపించింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి, విమర్శకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇండస్ట్రీ జనాలు కూడా నందినిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

శుక్రవారం మధ్యాహ్నం నుంచి నందిని ఫోన్ మోగుతూనే ఉందట. చాలామంది ఆమెకు కంగ్రాట్స్ చెప్పి సినిమా చేద్దామని అడుగుతున్నారట. ఓ పెద్ద నిర్మాణ సంస్థ నందినితో సినిమా చేయడానికి అంగీకారం కూడా కుదుర్చుకుందట. ఆ సినిమా మీడియం రేంజిలో ఉంటుందని సమాచారం. ఈ చిత్రంలో నాని హీరోగా నటించే అవకాశాలున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయి. నందిని తొలి సినిమా ‘అలా మొదలైంది’లో నానినే హీరో అన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా ఇద్దరి కెరీర్ లకూ బాగా ఉపయోగపడింది. నందినికి, నానికి మంచి రాపో కూడా ఉంది. ఆమెతో సినిమా అంటే నాని కాదనే ప్రసక్తే ఉండదు. వేరే కమిట్ మెంట్లు చాలా ఉన్నప్పటికీ నందిని సినిమాలో నాని నటించడానికి ఓకే అన్నట్లు సమాచారం.
Tags:    
  • Nandini Reddy 
  • Nani 
  • Telugu NEws 

Similar News

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Copyright @2026

Powered by Blink CMS