అతడు ఎందుకు నచ్చాడంటే..
సొంతం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఉత్తరాది అందం నమిత. తరవాత కాలంలో వెంకటేష్ లాంటి స్టార్ హీరో పక్కన సినిమా చేసినా పెద్దగా అవకాశాలు రాలేదు. దానికితోడు బాగా బొద్దుగా తయారవడంతో ఇక్కడ ఛాన్సులు తగ్గిపోయాయి. బొద్దు భామంలంటే బాగా ఇష్టపడే కోలీవుడ్ లో అవకాశాలు బాగా రావడంతో చెన్నైకు షిష్టయిపోయి అడపాదడపా మాత్రమే తెలుగు సినిమాల్లో కనిపించింది. ఆ మధ్య సీనియర్ నటుడు శరత్ బాబును పెళ్లి చేసుకోనుందనే రూమర్ తో వార్తల్లోకి వచ్చింది. తాజాగా ఎవరూ ఊహించని రీతిలో తమిళ నటుడు వీరేంద్రను పెళ్లి చేసుకోనున్నట్టుగా స్వయంగా ప్రకటించింది.
తన కాబోయే భర్త.. అతడిని ఎందుకు లైఫ్ పార్టనర్ గా సెలక్ట్ చేసుకున్నాననే విషయాలను రీసెంట్ గా నమిత బయటపెట్టింది. ‘‘వీర్ నాకు లాస్ట్ ఇయర్ నుంచి తెలుసు. మా ఇద్దరి కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం ఏర్పడింది. మా ఇద్దరి టేస్టులు కూడా ఒకటే కావడంతో తొందరలోనే మంచి స్నేహితులమయ్యాం. కొద్ది నెలల క్రితం బీచ్ లో క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేసి నాకు ప్రపోజ్ చేశాడు. అసలు ఆ ప్రపోజల్ ను నేను ఏ మాత్రం ఎక్స్ పెక్ట్ చేయలేదు. కానీ అతడి గురించి తెలుసు కాబట్టి వెంటనే ఓకే చెప్పేశా. ఆ తర్వాత కాలంలో అతడి గురించి నేను చాలా అర్ధం చేసుకున్నా.’’ అంటూ కాబోయే భర్త గురించి నమిత చెప్పుకొచ్చింది.
నమితను పెళ్లి చేసుకోబోతున్న వీర్ తమిళంలో చిన్నచిన్న పాత్రలు చేస్తుంటాడు. నమిత - వీర్ కలిసి మియా అనే థ్రిల్లర్ ఫిలింలో నటించారు. వీరిద్దరి వివాహం ఈనెల 24న తిరుపతిలో జరగనుంది.