నాగ్ కొత్త సినిమా.. సంక్రాంతి తర్వాతే క్లారిటీ
టాలీవుడ్ కింగ్ నాగార్జున నెక్స్ట్ మూవీ ఏంటి..? నాాగ్ అభిమానుల్లో మెదులుతున్న ప్రశ్న ఇది. ప్రస్తుతం అహిషోర్ సాల్మన్ డైరెక్షన్ లో నాగార్జున నటిస్తున్న మూవీ 'వైల్డ్ డాగ్'. ఈ చిత్రం షూటింగ్ గత నెలలోనే ముగిసింది. యథార్థ ఘటనల ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో నాగార్జున ఏసీపీ విజయ్ వర్మగా నటిస్తున్నారు. ఇక, ఈ వారాంతంలో బిగ్ బాస్-4 షూట్ కూడా ముగించబోతున్నాడు నాగ్. ఆ తర్వాత ఏ ప్రాజెక్టును ముందుకు తేబోతున్నాడన్నది సస్పెన్స్ గా మారింది. ఈ విషయమై ఫిల్మ్ నగర్లో పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే ప్రవీణ్ సత్తారు.. నాగార్జునకు ఓ కథ చెప్పి ఓకే చేయించుకున్నాడు. అయితే.. ఆ కథను నాగ చైతన్యతో చేయాలని ప్రవీణ్‌కు సూచించాడట కింగ్. అయితే.. ప్రవీణ్ సత్తారు మరో కథనున కూడా నాగ్ కు వినిపించాడని, దానికి కూడా ఇంప్రెస్ అయిన నాగార్జున.. సినిమా చేయడానికి అంగీకరించాడని చెబుతున్నారు. మరోవైపు.. విమర్శకుల ప్రశంసలు పొందిన బాలీవుడ్ థ్రిల్లర్ ‘రైడ్’ను రీమేక్ చేయడానికి ఆసక్తి చూపుతున్నాడట నాగ్. దీన్ని ఎవరి చేతుల్లో పెట్టాలా? అని ఆలోచిస్తున్నాడట.
మరో క్రేజీ ప్రాజెక్టు ‘బంగార్రాజు’ను పట్టాలెక్కించడానికి ఈ సోగ్గాడు సిద్ధంగా ఉన్నాడనే టాక్ కూడా నడుస్తోంది. బిగ్గెస్ట్ ఫ్యామిలీ హిట్ గా నిలిచిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రంలో బంగార్రాజు పాత్ర ఎంత హైలెట్ అయ్యిందే అందరికీ తెలిసిందే. అదే పేరుతో మరో చిత్రం చేయబోతున్నాడు మన్మథుడు. ఈ విధంగా నాగార్జున రాబోయే చిత్రంపై చర్చోపచర్చలు నడస్తున్నాయి. అయితే.. కింగ్ నెక్స్ట్ ప్రాజెక్టు ఏంటనే విషయమై సంక్రాంతి పండుగ తర్వాత అధికారిక ప్రకటన వెలువడుతుందని సమాాచారం. మరి, ఇన్ని ప్రాజెక్టుల్లో నాగ్ దేనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారనేది చూడాలి.