• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఊరించి ఉసూరుమనిపించిన...

ఊరించి ఉసూరుమనిపించిన నాగార్జున

By - Tupaki Desk
Update: 2020-11-15 05:00 GMT
బిగ్‌ బాస్‌ క్రియేటివ్‌ థాట్‌ మరోసారి తుస్సుమన్నది. కొన్ని రోజుల ముందు అఖిల్‌ ను బిగ్‌ బాస్‌ సీక్రెట్‌ రూంలోకి పంపించడం జరిగింది. అక్కడ నుండి అన్ని చూస్తూ వస్తున్న అఖిల్‌ కు నిన్నటి ఎపిసోడ్‌ లో నాగార్జున చుక్కలు చూపించాడు. నీవు అనుకున్నట్లుగా బయటకు ఇంట్లోకి వెళ్లడం లేదు. నువ్వు బయటకు వెళ్లాలి.. బ్యాగ్‌ సర్దేసుకుని ఇంట్లోకి వెళ్లి ఇంటి సభ్యులకు సెండాఫ్‌ ఇచ్చేసి సెల్ఫీ తీసుకుని బయటకు వచ్చేసెయ్‌ అంటూ నాగార్జున చెప్పగానే అఖిల్‌ చాలా ఏడ్చేశాడు. కాని ప్రేక్షకులు మాత్రం గత అనుభవాల దృష్టిలో అఖిల్‌ ఖచ్చితంగా ఇంట్లోనే ఉంటాడు. అతడు ఫైనల్‌ వరకు ఉంటాడు అనుకున్నారు. మరో వైపు అభిజిత్‌ అభిమానులు మాత్రం అఖిల్‌ బయటకు వెళ్లి పోవడంపై ఆనందం వ్యక్తం చేశారు.

అఖిల్‌ ఇంట్లోకి రాగానే ఇంటి సభ్యులు కొందరు చాలా ఆనందం వ్యక్తం చేయగా మరి కొందరు మాత్రం సో సో రియాక్షన్‌ లు ఇచ్చారు. బిగ్‌ బాస్‌ ఆదేశాల మేరకు సెల్ఫీ తీసుకుని అఖిల్‌ ను పంపించండి అంటూ ఆదేశించిన సమయంలో అంతా ఆశ్చర్యపోయారు. అదేంటి అంటూ నోరు వెళ్లబెట్టారు. ఇది సరైన నిర్ణయం కాదు అంటూ అరియానా కాస్త సీరియస్‌గానే అన్నది. అఖిల్‌ వెళ్తాడు అంటూ అభిజిత్‌ అభిమానులు హమ్మయ్య అనుకుంటూ ఉండగా అనూహ్యంగా అఖిల్‌ వెళ్లడం లేదు ఉంటున్నాడు అంటూ నాగార్జున చెప్పడంతో ఉసూరుమన్నారు. తెలుగు బిగ్‌ బాస్‌ లో ఇలాంటి ఉసూరుమనిపించే ఎపిసోడ్‌ లు చాలా ఉన్నాయి. తాజాగా మరోసారి అలాంటిదే ఇది కూడా అంటూ ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.
Tags:    
  • Bigg boss 
  • Bigg boss Season 4 
  • Tollywood 
  • Star Maa Bigg Boss 
  • Nagarjuna 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

రామ్, జెనీలియా స్నేహం.. ఇప్పటికీ అదే అనుబంధం!

2026-11-08 06:32 GMT

బ్లాక్ శారీలో తృప్తి డిమ్రీ మెరుపులు.. దీపావళి పార్టీ లుక్ వైరల్!

2026-11-08 06:11 GMT

పెద్ద రహస్యం బయటపెడతాను అంటున్న స్టార్ హీరో..!

2026-11-08 06:01 GMT

దర్శకుడిగా రాపిడో డ్రైవర్.. అసలు విషయం చెప్పిన వెంకీ కుడుముల

2026-11-08 05:48 GMT

శ్రీలీల కీలక నిర్ణయం.. ఇక ఈ హీరోయిన్ జోరు ఆపేవాళ్ళు ఎవరు గురు..!

2026-11-08 05:46 GMT

రావణుడిగా ప్రభాస్…అంత ఘోర అవమానం తరువాత ఇది అవసరమా..!

2026-11-08 04:55 GMT

మణిరత్నం.. చిరంజీవి..ఓ తమిళ దళపతి..!

2026-11-08 04:54 GMT

రామాయణం తీస్తూ రాముడినే మర్చిపోయారా?

2026-11-08 04:54 GMT

9వ వారం ఎలిమినేషన్ క్యాన్సిల్!

2026-11-08 04:43 GMT

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

Copyright @2026

Powered by Blink CMS