• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నాగ్ - జేబీ లు ఒకరినొకరు...

నాగ్ - జేబీ లు ఒకరినొకరు ఇలా పిలుచుకుంటారట!

By - Tupaki Desk
Update: 2018-11-10 04:47 GMT
అందరూ అందరినీ సొంతపేర్లతోనే పిలవరు.  కొందరు ముద్దు పేర్లతో పిలుచుకుంటారు.  మరికొందరు కస్టమైజ్డ్ పేర్లతో పిలులుచుకుంటారు.. అంటే తమకు మాత్రమే ప్రత్యేకంగా ఉండే పేరన్నమాట. 'అరవింద సమేత' ప్రమోషన్ ఈవెంట్స్ లో ఎన్టీఆర్ - త్రివిక్రమ్ ఒకరినొకరు 'స్వామి' అని పిలుచుకుంటామని తెలిపారు.  దీనికి త్రివిక్రమ్ కారణం కూడా చెప్పాడు. త్రివిక్రమ్ రైటర్ గా ఉన్నప్పుడే జూనియర్ ఎన్టీఆర్ పెద్ద స్టార్ అని.. వయసులో చిన్నవాడైనా పేరు పెట్టి పిలవడం బాగుండదని 'స్వామి' అని పిలవడం మొదలు పెట్టాడట. ఇక ఎన్టీఆర్ కూడా త్రివిక్రమ్ ని అలాగే స్వామి అని సంభోదించడం ప్రారంభించాడట.

ఇలాగే సీనియర్ హీరోలు అక్కినేని నాగార్జున - జగపతి బాబులు ఒకరిని ఒకరు 'చౌ-చౌ' అని పిలుచుకుంటారట.  చౌదరి-చౌదరి అని ఇద్దరూ తమ క్యాస్ట్ పేరుతో పిలుచుకుంటున్నారని మీరు పుసుక్కున అనుకునేరు.. కానీ కాదు.  జగపతి బాబు మొదటి నుండి క్యాస్ట్ గీస్టు అనే వాటికి వ్యతిరేకమే.  నిజానికి జగపతి బాబు ముద్దుపేరు చిన్నప్పటి నుండి చౌదరిగా ఉందట.  కారణం ఏంటంటే..  జగపతి బాబుకు వాళ్ళ తాతగారి పేరు పెట్టడంతో.. జగపతి అమ్మగారు ఆ పేరుతో కొడుకుని పిలవలేక పోయేవారట.  అప్పట్లో మామగారి పేరును అలా పిలిచేవారు కాదు. దీంతో ఆవిడ 'చౌదరి' అని పిలవడం మొదలు పెట్టిందట.  

ఇక జగపతి నాన్నగారు VB రాజేంద్ర ప్రసాద్.. ఏఎన్నార్ ఇద్దరూ మంచి మిత్రులట. దీంతో నాగార్జున.. జగపతి ల మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఇద్దరికీ రెండు మూడేళ్ళ వయసు తేడా ఉన్నప్పటికీ క్లోజ్ గా ఉంటారు. అందుకే జగపతి ని నాగ్ చౌ-చౌ అని పిలిస్తే.. జగపతి తిరిగి నాగార్జునను చౌ-చౌ అని పిలవడం మొదలు పెట్టాడట. 


Tags:    
  • Nagarjuna 
  • Jagapathi Babu 
  • Chowdary 

Similar News

అహంకారమనే ముద్రకు ధనుష్ వినూత్న కౌంటర్!

2026-11-15 09:46 GMT

అర్థరాత్రి పూట భార్య‌కి వార్నింగ్ లు!

2026-11-15 09:45 GMT

రామాయ‌ణ‌: 10రోజుల్లో 1200 కోట్లు.. 2000 కోట్ల క్ల‌బ్ ఇంకెంత దూరం?

2026-11-15 09:42 GMT

పని పోతుందనే భయంతో వేధింపులు సైతం భరించాను!

2026-11-15 09:38 GMT

25 ఏళ్లయినా ఇంకా జీవితాన్ని అర్ధం చేసుకుంటూనే ఉన్నా!

2026-11-15 07:32 GMT

త్రివిక్రమ్ గారు మీరు అలాంటి సినిమాలే తీయండి సార్...

2026-11-15 07:32 GMT

లగ్జరీ కంటే ప్రశాంతతే ముఖ్యం..ఎందుకో చెప్పిన సీత‌మ్మ‌

2026-11-15 06:52 GMT

బాలయ్యకు డిసెంబర్ సెంటిమెంట్.. ట్రాక్ రికార్డ్ ఎలా ఉందంటే..

2026-11-15 06:31 GMT

మెగా హీరో సినిమాలో ఛాన్స్.. బండి సరోజ్ ఎందుకు వద్దన్నారంటే!

2026-11-15 06:19 GMT

నిర్మాత కష్టాలతోనే సినిమా.. పేర్లు కూడా బయటపెడతానంటూ..

2026-11-15 05:28 GMT

భర్తతో ప్రేమ.. ఆ తర్వాత వేరే వాళ్లతో డేటింగ్.. కాజల్ లవ్ స్టోరీ ఇదే..!

2026-11-15 03:34 GMT

జూనియ‌ర్ అతిలోక సుంద‌రి అలా ఫెయిలైంది!

2026-11-15 02:30 GMT

Copyright @2026

Powered by Blink CMS