మాతో పెట్టుకోకు : నాగబాబు

Update: 2018-04-18 07:26 GMT
శ్రీరెడ్డి ఇష్యూ లో పవన్ కళ్యాణ్ మీద తీవ్రమైన కామెంట్స్ వచ్చిన రెండు రోజులకు మెగా ఫ్యామిలీ రియాక్షన్ నాగబాబు రూపంలో వచ్చేసింది. చాలా ఎమోషనల్ గా సీరియస్ గా కనిపించిన నాగబాబు ఒకదశలో గట్టి వార్నింగ్ కూడా ఇచ్చేసారు. ఎక్కడా ఎవరి పేరు ప్రస్తావించకుండా జాగ్రత్త పడిన నాగబాబు తన ప్రసంగం మొత్తం పవన్ మీద చేస్తున్న విమర్శల గురించే ఫోకస్ చేసారు. తమ మౌనాన్ని చేతగానితనంగా తీసుకోకండని సమయం వచ్చినప్పుడు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతామో తమకే తెలియదన్న నాగబాబు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయటం పట్ల తీవ్రంగా విరుచుకుపడ్డారు. తన వద్ద డబ్బు లేకపోయినా కోట్ల రూపాయల డబ్బు సినిమాల ద్వారా సంపాదించే అవకాశం ఉన్నా వాటిని వదిలేసి ప్రజా జీవితంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ని విమర్శించడం ఏంటని నాగబాబు తీవ్రస్వరంతో ప్రశ్నించారు. పక్కన ఉన్న శ్రీకాంత్ మధ్యలో కాస్త నియంత్రించే ప్రయత్నం చేసినప్పటికీ నాగబాబు ఈజీగా కూల్ కాలేదు.

సినిమాల్లో ఎవరికి అవకాశాలు ఇవ్వాలి అనేది నిర్మాత నిర్ణయమని తమనే తీసుకోవాలి అని డిమాండ్ చేయటం అర్థరహితమని తేల్చి చెప్పారు నాగబాబు. తప్పు చేయని వారు ప్రపంచంలో ఉండరని ఒకవేళ అదేదైనా ఉంటే పవన్ చెప్పినట్టు పోలీస్ స్టేషన్ కు వెళ్ళాలి కాని ఇలా టీవీ స్టూడియోలకు వెళ్లి పంచాయితీ చేయటం గురించి ఘాటుగా ప్రశ్నించారు. పవన్ తో తాను మాట్లాడి ఆరు నెలలు దాటిందని ప్రజల్లోకి వెళ్ళాక తను కూడా దొరకడం లేదని అలాంటి పవన్ కళ్యాణ్ ను దూషించడం పట్ల నాగబాబు బాగా హర్ట్ అయినట్టు కనిపించింది. మా సభ్యత్వం ఎవరికీ ఫ్రీగా ఇవ్వరని నిబంధనలు తెలుసుకుని మాట్లాడాలన్న నాగబాబు నిర్మాత తనకు ఇష్టం వచ్చిన వారిని తీసుకునే హక్కు ఉందని తేల్చి చెప్పాడు. ఇక కాస్టింగ్ కౌచ్ టీవీ పరిశ్రమతో సహా అన్నింటిలోను ఉందన్న నాగబాబు మీడియాకు కూడా గట్టి చురకలే వేసాడు.

నిన్న జీవిత ప్రెస్ మీట్ ముగిసిన ఇరవై నాలుగు గంటల లోపే మా తరఫున నాగబాబు మాట్లాడ్డం వాతావరణంలో మరింత వేడి రాజేసింది. తన వెర్షన్ చాలా స్పష్టంగా చెప్పిన నాగబాబు జీవిత తరహాలోనే ఆధారాలు తీసుకొచ్చి ఋజువు చేయండి తప్ప ఊరికే డబ్బులిచ్చే మీడియా ఛానల్స్ దగ్గరకు పోయి ఏసీలో కూర్చుని నోటికి వచ్చినట్టు మాట్లాడితే క్షమించే ప్రసక్తి లేదని గట్టి డోస్ ఇచ్చారు. దీనికి అటు వైపు నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందా అని ఎదురు చూస్తోంది మీడియా వర్గం.
Tags:    

Similar News