న్యూ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన నాగశౌర్య...!

Update: 2020-10-16 05:45 GMT
టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య వరుస ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ దూకుడు చూపిస్తున్నాడు. ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర సినిమాస్ మరియు నార్త్ స్టార్ ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నాడు శౌర్య. అలానే సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో లేడీ డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా రిజల్ట్ తో సంబంధం లేకుండా కొత్త తరహా సినిమాల్లో నటిస్తూ వస్తున్న శౌర్య.. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసాడు. 'అలా ఎలా' 'లవర్' చిత్రాల దర్శకుడు అనీష్ కృష్ణ తో నాగశౌర్య సినిమా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ ని సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ప్రస్తుతం శౌర్య నటిస్తున్న చిత్రాలకు పూర్తి భిన్నంగా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందనుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని శంకర్ ప్రసాద్ మల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ఉషా మల్పూరి నిర్మించనున్నారు. ఇది నాగశౌర్య హోమ్ ప్రొడక్షన్ లో రానున్న 4వ సినిమా. బుజ్జి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. నాగ శౌర్య 'ఛలో' సినిమాకు సూపర్ హిట్ ఆల్బమ్ అందించిన సాగర్ మహతి ఈ చిత్రానికి సంగీతం సమకూర్చనున్నారు. ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. అలానే నటీనటులు సాంకేతిక నిపుణులు వంటి పూర్తి వివరాలు తొందరలోనే వెల్లడించనున్నారు.
Tags:    

Similar News