వెంకీ.. సామ్ ను చూపించి రేట్ తగ్గిస్తున్నారా?

Update: 2020-05-04 05:30 GMT
శేఖర్ కమ్ముల దర్శకత్వం లో అక్కినేని నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'లవ్ స్టోరి'.  ఈ కరోనా క్రైసిస్ కనుక రాకపోతే ఈపాటికి సినిమా రిలీజై.. కుదిరితే ఓటీటీలకు కూడా వచ్చేది.  కానీ థియేటర్ల మూత కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది.   ప్రస్తుతం శేఖర్ కమ్ముల టీమ్ ఈ సినిమా అన్ని సవ్యంగా జరిగితే వినాయక చవితికి.. అంటే ఆగష్టు 22 న రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారట.

కొంత పెండింగ్ వర్క్ ఉందని.. అయితే ఆ పనులను 15 రోజులలో పూర్తి చేయవచ్చని అంటున్నారు.  లాక్ డౌన్ విరమణ ప్రకటించిన తర్వాత పెండింగ్ వర్క్ కంప్లీట్ చేసి సినిమాను విడుదలకు సిద్ధం చేస్తారట.  ఈ ప్లానింగ్ అంతా సూపర్ గా ఉంది కానీ సినిమా బిజినెస్ విషయంలో మాత్రం ఒక ఇబ్బంది ఎదురవుతోందట.  ఈ సినిమాను 40 కోట్ల రేంజ్ లో అమ్మాలని ప్లాన్ చేస్తున్నప్పటికీ బయ్యర్లు ముందుకు రావడం లేదట.  చైతు నటించిన చివరి రెండు సినిమాలు 'మజిలీ'.. 'వెంకీమామ' కు 40 కోట్లకు పైగా బిజినెస్ జరిగింది.  దీంతో 'లవ్ స్టోరి' రేట్లు  కూడా అదే స్థాయిలో కోట్ చేస్తుంటే బయ్యర్లు మాత్రం అదే సినిమాలు చూపించి రేటు తగ్గించమంటున్నారట.

'మజిలీ' లో సమంతా ఫ్యాక్టర్.. 'వెంకీమామ' లో వెంకటేష్ ఫ్యాక్టర్ ఉండడంతో ఆ రేంజ్ బిజినెస్ జరిగిందని ఈ సినిమాకు అలాంటి ప్లస్ పాయింట్ లేదని అంటున్నారు. దీంతో ఈ సినిమా నిర్మాతలైన ఏషియన్ సినిమాస్ వారు ఈసినిమాను ఎక్కువ రేట్లకు అమ్మాలంటే ఏం చేయాలనే ఆలోచనలో మునిగిపోయారట. చైతు ఒక్కడినే చూపించి ఆ రేంజ్ లో అమ్మడం వీలు కాదు కాబట్టి హీరోయిన్ సాయి పల్లవిని ప్రొజెక్ట్ చేసుకుంటే అవకాశం ఉండొచ్చు.  అయినప్పటికీ ఈ కరోనా క్రైసిస్ కారణం చూపించి తక్కువకు అడుగుతారేమో!
Tags:    

Similar News