ఇన్నాళ్లు వెయిట్ చేసి మళ్లీ ఓటీటీ ఏంటీ అల్లరి?
అల్లరి నరేష్ హీరోగా రూపొందిన 'నాంది' సినిమాను ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా మీడియా సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. వరుసగా ప్లాప్స్ ను చవిచూస్తూ వస్తున్న అల్లరి నరేష్ ఈ సినిమాను చాలా సీరియస్ గా తీసుకుని చేశాడు. నరేష్ సినిమాలు అంటే కామెడీని ప్రేక్షకులు ఆశిస్తారు. కాని అల్లరోడు ఈ సినిమాను చాలా సీరియస్ గా కంట తడి పెట్టించే విధంగా చేశాడు. ఇప్పటికే విడుదల అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు వీడియోలు సినిమా ఎలా ఉండబోతుందో చెప్పకనే చెప్పింది. ఈ సినిమాలోని ఒక సీన్ కోసం నరేష్ ఏకంగా నగ్నంగా కూడా నటించాడట. అల్లరి నరేష్ చాలా కష్టపడి నటించిన ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలని ఇన్ని రోజులు వెయిట్ చేశారు. ఎట్టకేలకు థియేటర్ల ఓపెన్ కు కేంద్రం నుండి అనుమతులు వచ్చాయి.
అక్టోబర్ 15 నుండి థియేటర్ల ఓపెన్ కు అంతా సిద్దం అవుతుంది. ఇలాంటి సమయంలో 'నాంది' సినిమా ఓటీటీ విడుదల విషయమై వార్తలు వస్తుండటం ఆశ్చర్యంగా ఉంది. థియేటర్లు పూర్తి స్థాయిలో నడవడం ఇప్పట్లో సాధ్యం అయ్యే అవకాశం లేదని అందుకే అరకొర ప్రేక్షకులు వచ్చే ఈ సమయంలో సినిమాను విడుదల చేస్తే ఖచ్చితంగా నష్టం తప్పదంటూ బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దాని కంటే అమెజాన్ తో వచ్చే రేటు చాలా ఎక్కువగా ఉంటుందట. అందుకే 'నాంది' సినిమాను ఓటీటీకి ఇచ్చేయాలనే నిర్ణయానికి మేకర్స్ వచ్చారంటూ టాక్ వినిపిస్తుంది. ఇప్పటి వరకు మేకర్స్ నుండి అధికారికంగా ప్రకటన అయితే రాలేదు. అతి త్వరలోనే క్లారిటీ వస్తుందేమో చూడాలి.